చాలా మిస్స‌వుతున్నా.. సానియామీర్జా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2020 11:23 AM GMT
చాలా మిస్స‌వుతున్నా..  సానియామీర్జా

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కి క్రీడారంగం కుదేలైంది. ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి ముప్పుతో చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యారు. అనుకోకుండా దొరికిన ఈ విరామాన్ని తమ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా కాలం గ‌డుపుతున్నారు. ఇక ఈ లాక్‌డౌన్ కాలంలో తాము చేస్తున్న ప‌నుల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

భార‌త టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా.. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతోంది. కాగా.. భార‌త దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మే 3 వ‌ర‌కు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించింది. దీంతో మంగ‌ళవారం సానియా ట్విట్ట‌ర్‌లో ఓ పోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో సానియా గోడ‌కు ఆనుకుని కింద కూర్చోని ఉంది. ఓ చేతిలో టెన్నిస్ బ్యాట్ ప‌ట్టుకొని ఉండ‌గా.. కింద చాలా టెన్నిస్ బంతులు ఉన్నాయి. ఈ ఫోటోను పోస్టు చేయ‌డంతో పాటు "ఆట‌ను చాలా మిస్స‌వుతున్నా.. మ‌ళ్లీ ఆడేందుకు వేచిచూస్తున్నాంటూ" రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక ఆట‌కు సానియా దాదాపు రెండేళ్ల పాటు దూరం అయ్యింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం క‌రోనా ముప్పుతో అన్ని క్రీడా టోర్నీలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.Next Story
Share it