ఆదిలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 2:00 AM GMT
ఆదిలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ నుండి ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ జేసన్ రాయ్ వైదొలిగాడు. ఢిల్లీ కేపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేసన్ రాయ్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడడం లేదంటూ జట్టు యాజమాన్యానికి తెలిపాడు. జేసన్ రాయ్ వైదొలగడంతో అతడి స్థానంలో డేనియల్ శామ్స్ ను ఢిల్లీ కేపిటల్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ అయిన డేనియల్ శామ్స్ 2019-20 సీజన్ బిగ్ బ్యాష్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టీ20, వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా తరపున ఆడనున్నాడు.

ఆగష్టు 28 నుండి జరగాల్సిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ సిరీస్ నుండి కూడా జేసన్ రాయ్ వైదొలిగాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుండి వైదొలిగిన రెండో ఇంగ్లీష్ ఆటగాడిగా జేసన్ రాయ్ నిలిచాడు. ఇంతకు ముందు క్రిస్ వోక్స్ కూడా ఢిల్లీ కేపిటల్స్ జట్టు నుండి వైదొలిగాడు. వోక్స్ స్థానంలో ఎన్రిచ్ నాట్జే ను తీసుకుంది ఢిల్లీ కేపిటల్స్. రాయ్ ను 1.5 కోట్లకు ప్లేయర్ ఆక్షన్ లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు కొనుక్కుంది.

ఐపీఎల్ 2020 సీజన్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ వేదికగా యూఏఈ వేదికగా జరగనుంది. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీలు యూఏఈకి చేరుకున్నాయి. ఆటగాళ్లు, జట్టు సభ్యులు, నిర్వాహకులు ఆరు రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉండాల్సి ఉంది. మూడు సార్లు కోవిద్ టెస్టులు నిర్వహిస్తారు. అందరికీ నెగటివ్ వచ్చిన తర్వాత యూఏఈలో ట్రైనింగ్ నిర్వహించనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ ను వీక్ డే లో నిర్వహించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో అలా జరగడం తొలిసారి. ఈ సీజన్ లో అరగంట ముందుగా మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

Next Story