ఎన్టీఆర్ పాటకు మళ్లీ దుమ్మురేపిన జపాన్ జంట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2020 9:23 AM GMT
ఎన్టీఆర్ పాటకు మళ్లీ దుమ్మురేపిన జపాన్ జంట

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్‌ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఆయన డ్యాన్స్‌. ఆయన డ్యాన్స్‌కు ఫిదా కాని వారంటూ ఉండరూ. ఇటీవల ఎన్టీఆర్‌ పాటలకు స్టెపులతో ఇరగదీసి తెలుగు అభిమానులకు దగ్గరైన జపాన్‌ జంట హీరో మునిరు, అశాహి. తాజాగా మరోసారి కొత్త పాటతో మెప్పించారు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన కంత్రి సినిమాలో 'వయస్సునామీ' పాట అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఆ పాటకు జపాన్‌ జంట.. ఎన్టీఆర్‌, హన్సిక వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్లు దింపేసింది. అనంతరం ఆ వీడియోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి డ్యాన్స్‌ చూసిన నెటీజన్లు.. సూపర్‌గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ జంట ఇప్పటికే సింహాద్రి సినిమాలోని ‘చీమ చీమ’ పాటకు స్టెప్పులేయగా, ఆ తర్వాత ‘గోల..గోల’ పాటతో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఓ సారి మీరు చూసేయండి

Next Story