జన్‌ధన్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
By సుభాష్
ప్రధాన మంత్రి జన్‌ధన్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ ఖాతాలు కలిగిన మహిళలందరికీ రెండో విడతగా రూ.500 చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఫైనాన్షియల్ సేవల విభాగం నిర్ణయించిన మే నెలలోని ఉపసంహణ ప్రణాళిక ప్రకారం.. జన్‌ధన్ ఖాతా నంబర్‌లో చివరి నంబర్ 0,1తో ముగుస్తాయో, వారి ఖాతాలో సోమవారం డబ్బులు జమ కానున్నాయి. ఖాతా చివర 2,3 నంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 5వ తేదీన, 4,5 నంబర్లతో ఉన్న ఖాతాల వారు మే 6వ తేదీన విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే చివరన 6,7 నంబర్లు ఉన్నవారు మే 8వ తేదీన, 8,9 నంబర్లతో ముగిసే ఖాతా నంబర్ ఉన్నవారు మే 11వ తేదీన వారి ఖాతాల నుంచి రూ.500 విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
కాగా, దేశంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా మోదీ ప్రభుత్వం మూడు నెలల పాటు ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ ఖాతాదారులందరి ఖాతాల్లో రూ.500 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటికే తొలి విడత వేయగా, ఇప్పుడు రెండో విడత డబ్బులు వేస్తోంది. మే 4న ఈ డబ్బులను ఖాతాల్లో జమ చేయనుంది.