బిగ్‌బ్రేకింగ్‌: గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం

By సుభాష్  Published on  3 May 2020 5:04 AM GMT
బిగ్‌బ్రేకింగ్‌: గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ పోరాటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నవైద్య బృందానికి ఇండియన్‌ సైన్యం ఘనంగా సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆదివారం దేశ వ్యాప్తంగా ప్లె పాస్ట్‌ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారత పౌర సంబంధాల అధికారి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ఆస్పత్రులపై ఈ పూల వర్షం కురిపిస్తున్నారు.

ఇందులో భాగంగానే వైద్యులు, వైద్య సిబ్బందికి అపురూప గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, విశాఖ చెస్ట్‌, గీతం ఆస్పత్రులపై పూల వర్షం కురిపించారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాలను వదిలిపెట్టి కరోనా రోగులకు సేలందిస్తున్న వారికి ఈ గౌరవం దక్కింది. మూడు హెలికాప్టర్ల ద్వారా ఈ పూల వర్షం కురిపించారు.

ఇలా పూల వర్షం కురిపించడంపై వైద్యులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం తీర ప్రాంతాలైన ముంబై, పోరుబందర్‌, కర్నార్‌, విశాఖ, చెన్నై, కొచ్చి, పోర్ట్‌ బ్లెయిర్‌ పోర్టుల్లో లైట్‌ హౌజ్‌లను వెలిగిస్తామని త్రివిధ దళపతి బిపిన్‌ రావత్‌ తెలిపారు.

Next Story