24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం: కేసీఆర్
By సుభాష్ Published on 21 March 2020 11:19 AM GMTఆదివారం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన శనివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆదివారం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బంద్ పాటిద్ధామని కోరారు. అత్యవసర సేవలు మినహా ప్రతీ ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు మూసివేయాలని ఆలోచిస్తున్నామని, ప్రభుత్వానికి సమాచారం అందించే మూసివేస్తామన్నారు. 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడినవారు 2,3 వారాలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితి వస్తే సీపీఎంబీనీ పరీక్షలకు ఉపయోగించుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ కోరామని, అందుకు మోదీ కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు.
ప్రతీ ఇంటికి రేషన్ పంపేలా ఆలోచన
అలాగే ప్రతీ ఇంటికి రేషన్ పంపేలా ఆలోచన చేస్తున్నామని, అన్నింటికంటే మించి మనం మన వైద్యులను కాపాడుకోవాలని పేర్కొన్నారు. వైద్యులకు కరోనా సోకకుండా ఉండేందుకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతీ ఒక్కరు ఇంటి గడపదాటి చప్పట్లు కొట్లాలన్నారని, జాతి ఐక్యతను చాటి చెప్పేందుకే చప్పట్లు కొట్టేదని కేసీఆర్ వివరించారు. ప్రధాని నరేంద్రమోదీపై కొందరు చిల్లర కామెంట్లు చేస్తున్నారని, ప్రధానిని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.