ఢిల్లీలో పవన్.. అమర సైనిక వీరుల కుటుంబాలకు రూ.కోటి చెక్కు
By అంజి
ఢిల్లీ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో అమరసైనికుల కుటుంబాల సంక్షేమానికి పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం ఇచ్చారు.
అమరవీరుల సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని బ్రిగేడర్ వీరేంద్రకుమార్ తనకు లేఖ రాశారని పవన్ అన్నారు. వీరేంద్రకుమార్ రాసిన లేఖ నన్ను కదిలించిందని పవన్ అన్నారు. తన వంత సహాయంగా రూ.కోటి విరాళం అందజేశారు.దేశాన్ని, సైనికులనే ప్రేమించే ప్రతి ఒక్కరూ సహాయం చేయాలన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొని పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. దేశానికి స్వచ్ఛమైన యువరాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత వహిస్తారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు.