సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై ఉగ్రదాడి

By సుభాష్  Published on  5 Oct 2020 9:17 AM GMT
సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై ఉగ్రదాడి

జమ్మూలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పుల్వామా జిల్లా పాంపొర్‌లోని కందిజల్‌ వంతెనపై జమ్మూకశ్మీర్‌ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని భారీ ఎత్తున బలగాలు చుట్టుముట్టాయి.

కాగా, ఉగ్రవాదులకు జమ్మూ ప్రాంతం అడ్డాగా మారింది. రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అందుకు తగ్గట్లుగా భద్రతా బలగాలు గుణపాఠం చెప్పినా వారి తీరు మారడం లేదు. ప్రతి రోజు ఏదో ఒక చోట కాల్పులకు తెగబడుతూ భద్రతా బలగాల చేతిలో బలవుతున్నారు.

Next Story
Share it