నాద‌ల్ ధ‌రించిన వాచ్ ధ‌ర తెలిస్తే 'వామ్మో' అంటారు త‌ప్ప‌కుండా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2020 8:53 AM GMT
నాద‌ల్ ధ‌రించిన వాచ్ ధ‌ర తెలిస్తే వామ్మో అంటారు త‌ప్ప‌కుండా..!

ర‌ఫెల్ నాద‌ల్.. ఈ పేరుకు పరిచ‌యం అక్క‌ర్లేదు. టెన్నిస్ ఆట‌గాడిగా ఎన్నో విజ‌యాలు సాధించి అభియానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలో భీక‌ర‌మైన ఫాలోయింగ్ ఉన్న నాద‌ల్ గురించి ఓ విష‌యం వైర‌ల్ అవుతుంది. నాద‌ల్ ధ‌రించిన గ‌డియారం విష‌యం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

అవును.. నాద‌ల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ధరిస్తున్న వాచ్‌ ఖరీదు అక్షరాల ఏడు కోట్ల 39 లక్షలు. స్విట్జర్లాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్‌ల తయారీ సంస్థ రిచర్డ్‌ మిల్‌ రూపొందించిన ఈ వాచ్‌ పేరు ‘ఆర్‌ ఎం 27-04’. రిచర్డ్‌ మిల్‌ వాచ్‌లకు రఫా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

వారిద్దరి భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మిల్‌.. ఈ వాచ్‌ను తయారు చేసింది. టెన్నిస్‌ రాకెట్‌ ఆకారంలో ఉండే ‘ఆర్‌ ఎం 27-04’ బరువు .284 గ్రాములు మాత్రమే. వాచ్‌పై ‘రఫా’ అని కూడా ముద్రించి ఉంటుంది. మొత్తంగా అత్యంత ఖరీదైన వాచ్‌ ధరించి బరిలోకి దిగిన టెన్నిస్‌ ఆటగాడిగా రఫా రికార్డు సృష్టించాడు.

Next Story