పాక్‌ బోర్డర్‌లో భారత ఆర్మీ ఆపరేషన్‌.. పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌

By సుభాష్  Published on  2 Jun 2020 4:39 PM IST
పాక్‌ బోర్డర్‌లో భారత ఆర్మీ ఆపరేషన్‌.. పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌

భారత్‌లో ఉగ్రమూకల ఆగడాలకు హద్దూ... అదుపు లేకుండా పోతోంది. రోజురోజుకు ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. భారత ఆర్మీ ఎన్నిసార్లు బుద్ది చెప్పినా వారి తీరు ఏ మాత్రం మారడం లేదు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఈ రోజు మరో ఇద్దరిని మట్టుబెట్టాయి. ఇక తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైదషే -ఇ- మహమ్మద్‌ ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. దక్షిణ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి భారత భద్రతా బలగాలు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపోర థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో బలగాలు రంగంలోకి దిగాయి.

భారత భద్రతా బలగాలపై ఉగ్రమూకలు విరుచుకుపడటంతో వారి కాల్పులను తిప్పకొట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఘటన స్థలంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులకు మంచి గుణపాఠం చెబుతున్నాయి భారత ఆర్మీ బలగాలు. దీంతో ఉగ్రవాదులు మరికొంత మంది నక్కిఉన్నారన్న సమాచారంలో సైన్యం ఆపరేషన్‌ చేపట్టింది. అయితే ఈ వేసవి కాలంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు భారీగా పెరిగాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ముష్కరులను మట్టుబెడుతున్నట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

కాగా, కశ్మీర్‌లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. పూంచ్‌ జిల్లాలో ఉగ్రవాదుల చొరబాట్లను భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పూంచ్‌ జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Next Story