బ్రేకింగ్‌న్యూస్‌: సింగరేణిలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికుల మృతి

By సుభాష్  Published on  2 Jun 2020 6:38 AM GMT
బ్రేకింగ్‌న్యూస్‌: సింగరేణిలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికుల మృతి

సింగరేణిలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ -1లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫేజ్‌ -2లో బ్లాస్టింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటన స్థలానికి చేరుకున్న పో్లీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతులు రాకేష్‌, భీమయ్య, ప్రవీణ్‌, శంకర్ల, మరొకరిని గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతున్నవేళ సింగరేణిలో విషాదం చోటు చేసుకుంది. బ్లాస్టింగ్‌కు సంబంధించిన ముడి పదార్థాలను నింపుతుండగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఘటన స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా,తెలంగాణలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితమే ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన సింగరేణి సంస్థ.. అంచలంచెలుగా విస్తరించింది. 1920 డిసెంబర్‌ 23న పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ దేశంలో వేలాది పరిశ్రలమకు ఇంధనాన్ని అందిస్తున్న సంస్థ నల్లబంగారు గని 'సింగరేణి'. తర్వాత కాలంలో నిజాంప్రభువుల ఆధీనంలోకి కంపెనీకి వెళ్లి సింగరేణిపై అధికారం తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రానికి వెళ్లింది. 1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ గా మార్పు చేశారు.

Next Story