జమ్మలమడుగులో దారుణం.. భార్య, తల్లిపై కత్తితో దాడి

 Published on  30 Dec 2019 5:00 AM GMT
జమ్మలమడుగులో దారుణం.. భార్య, తల్లిపై కత్తితో దాడి

కడప: జమ్మలమడుగు పట్టణంలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు ఫుటూగా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్యపై రాయితో దాడి చేశాడు. దీంతో భార్య తీవ్ర గాయాలపాలైంది. తనను భర్త నాగరాజు వేధిస్తున్నాడని స్థానిక జమ్మలమడుగు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త నాగరాజును పోలీస్‌స్టేషన్‌ రప్పించారు. అనంతరం నాగరాజుకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంపై భర్త ఆగ్రహానికి గురయ్యాడు. భార్య, తల్లిపై కత్తితో మరోమారు కత్తితో దాడికి పాల్పడ్డాడు. కాగా భార్య అక్కడి నుంచి తప్పించుకుంది. తల్లిపై కత్తితో నాగరాజు దాడి చేస్తుండగా.. తల్లిని పోలీసులు కాపాడారు. తీవ్రంగా గాయపడిన తల్లిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ నాగరాజు మద్యానికి బానిస అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it