కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా పదివేలమందికి పైగా మృత్యువాత పడగా.. రెండు లక్షల మంది కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో సినీతారలు, క్రీడాకారులు ఎవరికి వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. తాజాగా.. జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత.. డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని.. ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని తెలిపింది.

ఓల్గాకు కరోనా సోకిందని తెలిసిన ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు కరోనా పై సూచనలు ఇచ్చింది. ఇంట్లోనే ఉంటున్నానని, ఓ గదిలో ఉంటూ.. ఎవరిని కలవలేదని చెప్పింది. కరోనాని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పింది. విటమిన్ బీ5.. విటమిన్ ఈ.. విటమిన్ సీ.. జింక్ ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని చెప్పింది బాండ్ గాళ్. ఇదిలా ఉంటే.. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆమె.. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.