ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్‌ తన లాయర్ల ద్వారా వేసిన ఆబ్సెంట్‌ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో సహనిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.