ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

By సుభాష్  Published on  6 March 2020 7:52 AM GMT
ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా హరీష్‌ కుమార్‌ గుప్తా, విశాఖ అదనపు డీజీగా ఆర్‌కే మీనాకు పదోన్నతి లభించింది. డీజీపీ కార్యాలయంలో న్యాయ విభాగంలో హరికుమార్‌ కు పోస్టింగ్‌ దక్కగా, ఎస్‌ఐబీ ఐజీగా సిహెచ్‌ శ్రీకాంత్‌ నియమితులయ్యారు. అలాగే మెరైన్‌ విభాగం ఐజీగా ఏఎస్‌ఖాన్‌, గుంటూరు రేంజ్‌ ఐజీగా ప్రభాకర్‌రావు బదిలీ అయ్యారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌ ఐజీతో పాటు ఎక్సైజ్‌, ప్రొహెబిషన్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Next Story
Share it