ఇసుక కొరతపై జ‌గ‌న్ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

By Medi Samrat
Published on : 11 Oct 2019 5:19 PM IST

ఇసుక కొరతపై జ‌గ‌న్ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత నివారించేందుకు సీఎం వైఎస్ జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇసుక లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన ధరను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రైవేటు పట్టాదారులకు క్యూబిక్ మీటరు ఇసుకకు చెల్లించే ధరను ప్రభుత్వం పెంచింది. గతంలో రూ. 60కు క్యూబిక్ మీటరుగా ఉన్న ధరను రూ.100కు పెంచుతూ సవరణ చేసింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించే రీచ్‌లు, స్టాక్ యార్డులతో పాటు ప్రైవేటు పట్టాదారు భూముల్లోనూ ఇసుక తవ్వకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story