సీనియర్ జర్నలిస్ట్‌లను పదవులతో గౌరవిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 12 Oct 2019 11:58 AM IST

అమరావతి: ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం సీనియర్లు జర్నలిస్ట్‌లను గౌరవిస్తుంది. అంతేకాదు..వారి సేవలను వాడుకుంటుంది. సాక్షి టీవీలో జర్నలిస్ట్‌గా పని చేసిన అమర్, సాక్షిలోనే ఈడీగా పని చేసిన రామచంద్రమూర్తి లను ప్రభుత్వ సలహాదారులగా నియమించుకుంది. అలాగే..కేబినెట్ ర్యాంకులు కూడా ఇచ్చింది. ఇక..సజ్జల రామకృష్ణా రెడ్డి సేవలను వైఎస్ జగన్ మొదటి నుంచి వాడుకుంటున్నారు. పార్టీలో సజ్జల క్రియాశీల పాత్ర పోషించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చే వరకు అలుపెరగని సేవలు అందించారు సజ్జల రామకృష్ణా రెడ్డిసాక్షి టీవీలో ప్రీలాన్స్ గా పని చేసిన జర్నలిస్ట్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ లో డైరక్టర్‌గా అవకాశం ఇస్తారని సమాచారం. నేడోరేపో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని చెబుతున్నారు.
Next Story