హైదరాబాద్‌ : వైఎస్ జగన్ సీఎం అయినా..ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు వదలడం లేదు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే..వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్ వేసింది. దీనిపై సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు జరగనున్నాయి. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంఅయ్యారు కాబట్టి..పరిపాలన పరమైన అంశాలు చాలా ఉంటాయని..ఆయన అక్కడ నుంచి వస్తే పరిపాలన పరమైన ఇబ్బందులు ఉంటాయని..ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సో..శుక్రవారం జగన్, సీబీఐ న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించడానికి సిద్దమవుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.