జడేజా సూపర్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

By Newsmeter.Network  Published on  1 March 2020 9:22 AM GMT
జడేజా సూపర్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

భారత అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా అద్భుత ఫీల్డింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఈ సూపర్‌ క్యాచ్‌ను పట్టాడి ఆల్‌రౌండర్‌.

మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్స్‌ 72వ ఓవర్‌ చివరి బంతిని వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌లో భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతి బౌండరీ వెళ్లడం పక్కా అన్నట్టు కెమెరా కూడా బౌండరీ లైన్‌నే చూపించింది. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని ఓ మై గాడ్‌ అనిపించాడు. ఆ ఊహించని సూపర్‌మ్యాన్‌ క్యాచ్‌కు వాగ్నర్‌ షాక్‌కు గురికాగా.. సహచర క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడేజాను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. జడేజా సరిలేరు నీకెవ్వరు అని ఓ నెటీజన్‌ కామెంట్ చేయగా.. సలాం జడ్డూభాయ్‌.. మా రాక్‌ స్టార్‌ వీ నువ్వే కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు ఏడు పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్‌కు 97 పరుగులకు ఆధిక్యం ఉంది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి, రిషబ్ పంత్ ఉన్నారు.Next Story
Share it