జీ తెలుగుకు జబర్దస్త్ షిప్ట్ ! మల్లెమాల తెర వెనుక అసలేం జరిగింది?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Nov 2019 1:49 PM ISTఔను మీరు విన్నది నిజమే .. జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకున్నాడు. ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో మాత్రమే నాగబాబు కనిపిస్తారు. ఈ ఆదివారం నుంచి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సరికొత్త ఎపిసోడ్ లో నాగబాబు కనిపించనున్నారు. ఇంతకు నాగబాబు జబర్దస్త్ కు ఎందుకు బై బై చెప్పారు. ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే.. మనం ఓ వారం వెనక్కి వెళ్ళాలి. అసలు జబర్దస్త్ హిట్ కావడానికి బ్యాక్ బోన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ డైరెక్షన్ టీం మెయిన్ క్యాండిడేట్స్ నితిన్ -భరత్ జోడిని జీ తెలుగు లాగేసుకుంది. చాల హెవీ అమౌంట్‌తో నితిన్ -భరత్ ను ఆ ఛానల్ తీసుకుందని తెలిసింది. ఇక్కడే అసలు ఆట మొదలైంది.
జబర్దస్త్ స్టార్ట్ అయినా దగ్గర నుంచి ఈటీవీ రేటింగ్స్ ఓ లెవెల్లో పెరిగింది. ఆ షో ను దెబ్బకొట్టేందుకు చాలా ఛానెల్స్ చాలా రకాలుగా ప్రయత్నించాయి. యాంకర్ సుమ కూడా ఇలాంటి కామెడీ షో చేసి చేతులు కాల్చుకుంది. తర్వాత జెమిని కూడా కొన్నాళ్ళు నడిపింది. ఈ పాఠాలన్నీ నితిన్ -భరత్ కు తెలుసు అందుకే పక్కా ప్లాన్ తో గ్రౌండ్ వర్క్ చేశారు.
నితిన్ -భరత్ జీ తెలుగు షిఫ్ట్ కాగానే ముందు టార్గెట్ నాగబాబుని పట్టాలని చూశారు. కానీ మల్లెమాల తో నాగబాబు కున్న రిలేషన్‌తో మొదట అయన ఒప్పుకోలేదు. ప్లాన్ ఏ పారక పోవడంతో ప్లాన్ బి ని అమలు చేశారు. ముందుగా టీం లీడర్స్ కు వల వేశారు. ఆ వలలో పడిన మొదటి చేప చమ్మక్ చంద్ర. భారీ అమౌంట్ తో అంటే దాదాపు షో కు రూ.4 లక్షలు. తర్వాత ఓల్డ్ టీం లీడర్స్ పై కన్నేశారు.. అందులో ధనరాజ్ ఒకడు....
ఈ విషయాలన్నీ పసికట్టిన మల్లెమాల టీం అలెర్ట్ అయింది. ఎవరు బయటకు వెళ్లకుండా అగ్రిమెంట్ రాయించుకునేందుకు ట్రై చేసింది... ఇక్కడే మల్లెమాల తప్పులో సారీ అగ్రిమెంట్ మీద కాలేసింది. నాగబాబును కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేయాలనీ కోరింది .ఇక్కడే నాగబాబు చాలా హార్ట్ అయినట్లు తెలిసింది. అందుకే ఈ వారం జరగాల్సిన షో కు నాగబాబు వెళ్లేందుకు ససేమిరా అన్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నితిన్ -భరత్ మరోసారి నాగబాబుని అప్రోచ్ అయ్యారట. ఈ సారి డబుల్ ఆఫర్ చేశారట.. అసలే అగ్రిమెంట్ ఇష్యూ తో కోపంగా ఉన్న నాగబాబు జీ తెలుగు ఆఫర్ కు ఓకే అన్నారట.
నాగబాబే షో నుంచి తప్పుకోవడంతో సుడిగాలి సుధీర్ టీం కూడా షో నుంచి జంప్ అయినట్లు న్యూస్ వచ్చింది. ఇప్పటికే జీ తెలుగు లో షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో లో నాగబాబుతో పాటు యాంకర్ రవి...ప్రదీప్ ఉన్నారు...షో ఈ సండే నుంచే స్టార్ట్ కాబోతోంది.