నైట్‌కు నైటే జంప్..!
By అంజి Published on 19 Feb 2020 3:19 AM GMTఆయన ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చినప్పుడు నన్ను లేడీ గెటప్‌లో తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అలా చూసిన కాసేపటికే నువ్వు లేడీ గెటప్‌లో చాలా బాగున్నావ్ అని చెప్పి నా సెల్ నెంబర్ తీసుకున్నాడు. అలా కాంటాక్ట్ అయ్యాక ఫోన్‌లోనే అన్నీ మాట్లాడుకున్నాం. దాదాపు ఆరు నెలల తరువాత సడెన్‌గా ఒక రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను అన్నీ మాట్లాడేశాను. రేపు ఉదయం ఆరు గంటలకల్లా హైదరాబాద్ వచ్చెయ్యమన్నాడు. దాంతో నైట్‌కు నైటే జంప్..!
జబర్దస్త్‌లో తనకు అవకాశం కల్పించిన బుల్లెట్ భాస్కర్ గురించి ఇలా చెప్పుకొచ్చింది హరిత అలియాస్ హరి. తనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపింది. మాది విసన్నపేట దగ్గర తాతగుంట్ల గ్రామం. బాల్యం మొత్తం అక్కడే జరిగింది. బేసిగ్గా నేను డ్యాన్స్ మాస్టర్‌ని. తాతగుంట్ల గ్రామం నుండి ముప్పై కిలో మీటర్లు ఉన్న సత్తుపల్లి పట్టణంలో డ్యాన్స్ మాస్టర్‌గా చేసేవాడిని. అక్కడే స్కూల్స్ చెబుతూ ఏ ఈవెంట్ జరిగినా డ్యాన్స్ కంపోజ్ చేసేవాడిని.
ఒక రోజు డ్యాన్స్ కాంపిటీషన్ కిరాణా మర్చంట్స్ కళ్యాణ మండపంలో జరిగింది. దానికి జబర్దస్త్ కంటెస్టెంట్ బుల్లెట్ భాస్కర్ గెస్ట్‌గా వచ్చారు. ఆ ఈవెంట్‌కు వచ్చినప్పుడు నువ్వు లేడీ గెటప్‌లో బాగున్నావ్. జబర్దస్త్‌లో చేస్తావా..? అంటే చేస్తానని చెప్పాను. అలా నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అయ్యా. దాదాపు ఆరు నెలల తరువాత సడెన్‌గా ఒక రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను నీ గురించి చంటికి చెప్పాను. ఎల్లుండే షూట్.. రేపు మార్నింగ్ సిక్స్‌కల్లా వచ్చెయ్యాలని చెప్పారు. దాంతో నైట్‌కు నైటే జంపన్నమాట.
ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ చేశా.. ప్రస్తుతం డిగ్రీ డిస్టెన్స్ చేస్తున్నా. లాస్ట్ టు ఇయర్స్ కంటే ప్రస్తుతం నా జీవితం బాగానే ఉంది. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. పెద్దక్క హ్యాండీక్యాప్డ్ కనుక పెళ్లి చేసుకోనని చెప్పింది. దాంతో ఆమె నా బిడ్డ మాదిరి అన్నీ నేనే చూసుకుంటా. చిన్నక్క ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివింది. అత్తగారబ్బాయిని పెళ్లిచేసుకుని స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంది. ఇక నా పెళ్లి విషయానికొస్తే నాకింకా కొన్ని గోల్స్ ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యాక చేసుకుందామని ఆగాను.
వాళ్లు నాకు మంచి దోస్తులే..
చిన్నసాయి, పింకీ, నజీరా ఇలా జబర్దస్త్‌లో లేడీ గెటప్ వేసే ప్రతీ ఒక్కరూ నా ఫ్రెండ్సే. చిన్నప్పుడు బడికెళ్లే సమయంలో ఎనిమిదో తరగతి వరకు చాలా సైలెంట్‌గా ఉన్నా. స్కూళ్లలో డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టినా, కల్చరల్ యాక్టివిటీస్ ఏం పెట్టినా నేను ముందుండే వాడ్ని. స్కూల్‌కు వెళ్లకున్నా నా పేరు రాసుకునేవారు. ఎనిమిదో తరగతి వరకు నా స్టడీ బాగానే జరిగింది.
ఇప్పటి వరకు చాలా మంది ఇటు అబ్బాయిలు, అటు అమ్మాయిల నుండి రెండు వైపులా లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. అబ్బాయిలైతే ఏకంగా డేటింగ్‌కి అడిగేశారు. నేను ఇంత వరకు ఏ అమ్మాయినీ లవ్ చేయకపోయినా, చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. నేను ఇప్పటికీ సింగిలే. మా ఊరికి పది కిలో మీటర్ల పరిధిలో హోటళ్లు ఉండనందున ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఇంటి వద్దే రెడీ అవుతా. బలిసిన ఫ్యామిలీల ఈవెంట్లయితే కారు పంపిస్తారు. మిగిలిన వాళ్లయితే నేనే ఓన్‌గా వెళుతా. అలాంటి సమయంలో అబ్బాయిలు వెనక పడతారు. అలా వారు వెనక పడతారనే వెనుక, ముందు మొత్తం నలుగురిని సెక్యూరిటీకి పెట్టుకుంటా. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అందరిలా అమ్మాయినే చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు హరిత అలియాస్ హరి.