జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్ధరాత్రి స్కూటీ ఆపేసి నడి రోడ్డుపై ..
By సుభాష్ Published on 26 May 2020 11:18 AM ISTజబర్దస్త్ కామెడీ షో.. ఇది ప్రతి ఒక్కరి తెలిసిందే. వారంలో రెండు రోజుల పాటు రాత్రి 9.30 గంటల ఈటీవలో ప్రసారం అవుతుంది. అయితే జబర్దస్త్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఎంతో మంది కమెడియన్లకు ఈ షోద్వారా మంచి అవకాశాలే వచ్చాయి. మంచి పోజిషన్‌లో ఉన్నారు. అలాంటి కమెడియన్‌లలో ఒకరైన సాయితేజ అలియాస్ ప్రియాంక. జబర్దస్త్ షోలో చేసిన ఈయన కూడా ఒకడు. కానీ ఇప్పుడు ఆమె అయ్యాడు. అలాగే సాయితేజ బదులు ప్రియాంక అని పేరు కూడా మార్చుకున్నాడు. జబర్దస్త్ స్టేజిపై చేసే కామెడీ అంతా ఇంతా కాదు. కమెడియన్లకు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. తెరముందు అందరిని నవ్విస్తుంటారు కానీ.. తెరవెనుక ఎన్నో కష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది వారు పడుతున్న బాధలను చెప్పుకొంటుంటారు.
ఇక తాజాగా ప్రియాంక ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందని, అలాగే తెర ముందు అందరిని నవ్వించినా.. తెరవెనుక ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ కొందరు పనికిమాలిన వాళ్లు చేసే చేష్టాల వల్ల ఒక్కో సారి బాధేస్తుంటుందని చెప్పుకొచ్చారు. కొందరు రకరకాలుగా తమపై కామెంట్లు చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి కొందరు చేస్తున్న పనుల వల్ల సమాజం తలదించుకునేలా మారుతోందని, రకరకాలుగా కామెంట్స్‌తో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని ఆమె తెలిపింది.
గత మూడు రోజుల కిందట నాతో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు.. అర్ధరాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్ నిలిపివేసి చాలా దారుణంగా ప్రవర్తించారు అంటూ వాపోయింది. అర్థరాత్రి సమయంలో స్కూటీపై వస్తుంటే వాళ్లు నన్ను చూసి కామెంట్స్ చేశారని, అలాంటి వాళ్లను చంపేసినా పాపం లేదని మండిపడింది. అర్దరాత్రి సమయంలో నడిరోడ్డుపై ఇలా ప్రవర్తించడం ఎంత సమంజసమని అంటోంది.
పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి చెక్‌పెట్టింది ప్రియాంక. నన్ను ఎవరు పెళ్లి చేసుకోరని, మోసం చేసేవాళ్లే ఈరోజుల్లో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. అలాగే ఇటీవల ఓ డైరెక్టర్ నన్ను రూమ్‌కి రమ్మన్నాడు.. రూమ్‌కు వచ్చాక అసభ్యకరంగా ప్రవర్తించాడు.. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి మూడు రోజుల పాటు ఆయన రూమ్‌లోనే ఉండాలని, ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని ఇలా రకరకాలుగా అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది ప్రియాంక.
అయితే ఇలా సమాజంలో ఎందరికో ఇలాంటి అటుపోట్లు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సమాజంలో నీచంగా ప్రవర్తించేవారు ఎక్కువైపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇలాంటి వాళ్లు ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. హేళన చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇలా ఎన్నో రకాలుగా ప్రవర్తించడం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ల అగడాల వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.