అసలు వాడు మగాడే కాదు.. నిప్పులు చెరిగిన యాంకర్‌ రష్మీ

By సుభాష్  Published on  3 May 2020 1:41 PM GMT
అసలు వాడు మగాడే కాదు.. నిప్పులు చెరిగిన యాంకర్‌ రష్మీ

జబర్దస్త్‌ బ్యూటీ, యాంకర్‌ రష్మీ గౌతన్‌ ఓ వ్యక్తిపై నిప్పులు చెరిగింది. వాడు అసలు మగాడే కాదు.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడిపోయింది. ఓ యువకుడి మీద తీవ్ర స్థాయిలో కోపంతో ఊగిపోయింది. ఈ కోపం ఎందుకంటే.. ఓ యువకుడు కుక్కను కొట్టినందుకు. ఎందుకంటే రష్మీకి జంతువులు, పెంపుడు కుక్కలు అంటే ఎంతో ఇష్టం. ఇటీవల కూడా బెంగళూరులో ఓ వ్యక్తి కుక్కను తన్నినందుకు సోషల్‌ మీడియా ద్వారా తిట్టిపోసింది. అతనిపై కేసు నమోదు చేయాలంటే ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

ఇప్పుడు కూడా అంతే. దీనికి సంబంధించిన ఓ వీడియోను చూసి రష్మీ గౌతమ్‌కు బీపీ లేచింది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని బ్రిజ్‌పురి బి బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌ మీద వెళ్తుంటే అతన్ని చూసి కుక్క మెరిగింది. వెంటనే అతను ఆ కుక్కు వెంటాడి తరిమమాడు. ఆ పక్కనే ఉన్న మిగితా కుక్క పిల్లలను సైతం తరిమికొట్టాడు. అంతేకాదు మళ్లీ ఓ గ్యాంగ్‌తో వచ్చి కుక్కలను వెంటాడి కర్రలతో, బెల్టులు తీసుకొచ్చి కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీధి కుక్కలపై ఎంతో ప్రేమ చూపించే రష్మీ ఈ వీడియోను చూసిన తర్వాత కోపంతో రగిలిపోయింది. వీడు అసలు మగాడే కాదు, వాడి మగతనం నోరులేని జీవాల మీద చూపిస్తాడా..? అని రగిలిపోయింది. అలాంటి వారికి వ్యతిరేంగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది రష్మీ.Next Story