నీవు వర్జినేనా.. ఛీ.. ఏం మాట్లాడుతున్నావ్ 'జాను'..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jan 2020 2:15 PM GMT
నీవు వర్జినేనా.. ఛీ.. ఏం మాట్లాడుతున్నావ్ జాను..!

శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కుతున్న ‘జాను’ చిత్రం ట్రైల‌ర్ నేడు రీలీజైంది. తమిళనాట ఘ‌న‌ విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించగా.. ఇక్క‌డ స‌మంతా, శ‌ర్వానంద్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇదివ‌ర‌కే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ అభిమానులను ఆక‌ట్టుకోగా.. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ సినిమాకు సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం, గోవింద్‌ వసంత్‌ సంగీతమందిస్తున్నారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికొస్తే.. ‘ఎగిసిపడే కెరటాల్లో.. ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓరచూపు కోసం నీ దోరనవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఈయలేవా..?’ అంటూ క‌థానాయ‌కుడు చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్‌ మొద‌ల‌వుతుంది. అలాగే ‘నువ్ వర్జినేనా అని సమంత అడగడం.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను’ అంటూ శర్వానంద్ తెగ సిగ్గుపడటం యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది.

ఇక‌ ‘ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏమో జరిగిపోతుందని మనసుకి మాత్రం ముందే తెలిసిపోతుంది’ అంటూ సమంత చెప్పే డైలాగ్‌.. అలాగే.. 10 నెలల మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే.. ఇనాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతం' అంటూ శర్వానంద్ చెప్పిన‌ డైలాగులు ఆక‌ట్టుకుంటాయి.

ఇదిలావుంటే.. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. పిబ్ర‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Next Story