లాక్‌డౌన్‌: నడి రోడ్డుపై కామంతో రెచ్చిపోయి కారులోనే..

By సుభాష్  Published on  3 April 2020 5:25 AM GMT
లాక్‌డౌన్‌: నడి రోడ్డుపై కామంతో రెచ్చిపోయి కారులోనే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా భయంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్న సమయంలో ఓ జంట కామంతో రెచ్చిపోయింది. కరోనా కాటుతో రోడ్లపైకి రావద్దనే నిబంధనలను ఉల్లంఘించి నడిరోడ్డుపై బరితెగించారు. ఓ జంట కారును రోడ్డుపక్కన నిలిపి శృంగారంలో మునిగితేలారు. ఇలా రాసలీల్లో తేలియాడుతున్న వీరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఇటలీలోని మిలన్‌ నగరంలో చోటు చేసుకుంది.

ఒక వైపు కరోనా దెబ్బకు అల్లాడిపోతున్న ఇటలీలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఆ దేశంలో కరోనా కాటుకు వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చైనా కంటే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది అక్కడి సర్కార్. అత్యవసర సేవలు మినహాయించి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది.

అయితే మిలన్‌ నగర శివారులో నడిరోడ్డుపై ఓ జంట పాడు పనికి పాల్పడి చిక్కుల్లో చిక్కుకుంది. ఈజిప్ట్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు, 40 ఏళ్ల మహిళ అడ్డంగా బుక్కైపోయారు. కాగా, కారులో ఇద్దరు కలిసి ప్రయాణించడాన్ని అక్కడ నిషేధం విధించారు. కారులో ఈ ఇద్దరు వ్యక్తులు ఉండడం గుర్తించిన పోలీసులు.. వీరు చేస్తున్న ఘనకార్యాన్ని చూసి షాకయ్యారు. వీరిపై లాక్‌డౌన్‌ ఉల్లంఘనతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

Next Story