ప‌చ్చ‌ని కాపురంలో అక్ర‌మ సంబందాలు చిచ్చుపెడుతున్నాయి. తాత్కాలిక సుఖం కోసం జీవిత భాగ‌స్వాముల‌ను చంపేందుకు వెనుకాడ‌డం లేదు కొంద‌రు. త‌న క‌డుపున ప‌ట్టిన బిడ్డ‌ల‌ను సైతం త‌మ సంబందానికి అడ్డు వ‌స్తున్నార‌ని చెంపేందుకు వెనుకాడ‌డం లేదు. ఓ వివాహిత ముగ్గురితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. భ‌ర్త భ‌య‌టికి వెళ్ల‌గానే ప్రియుళ్ల‌ను ఇంటికి పిలిపించుకుని రాస‌లీల‌లు సాగించేది. ఈ విష‌యం తెలిసిన భ‌ర్త.. ఆమె ప్ర‌వ‌ర్త‌నను మార్చుకోమ‌ని హెచ్చ‌రించాడు. భ‌ర్త మాట విన‌క‌పోగా ఈ విష‌యం ప్రియుళ్ల‌కి చెప్పింది. దీంతో వారు రోజు ఆమె భ‌ర్త‌ను సూటిపోటి మాట‌ల‌తో వేధించేవారు. వీరి వేదింపులు భ‌రించ‌లేని ఆవివాహిత భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో జ‌ర‌గగా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

రాజ్‌కోట్‌లోని గాంధీరామ్ అనే ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్‌భాయి మహేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. ప్ర‌హ్లాద్ కూలి ప‌నులు చేసేవాడు. ఉద‌యం ప‌నికి వెళ్తే రాత్రికే వ‌చ్చేవాడు. దీంతో రోజంతా ఒంట‌రిగా ఉంటోంది మ‌హేశ్వ‌రీ. ఈ క్ర‌మంలో అదే ప్రాంతానికి చెందిన నర్సింహ, రవిశంకర్, మహేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భ‌ర్త రోజు బ‌య‌టికి వెళ్ల‌గానే.. ముగ్గురు ప్రియుళ్లను ఇంటికి రప్పించుకుని రాస‌లీల‌లు సాగించేది.

చాలా రోజులు గుట్టుగా సాగింది ఈ య‌వ్వారం. భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు గ‌మ‌నించిన ప్ర‌హ్లాద్ ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని అనేక సార్లు చెప్పాడు. భ‌ర్త మాట‌ను మ‌హేశ్వ‌రీ విన‌లేదు స‌రిక‌దా.. ఇంకా ఎక్కువ చేసేది. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుళ్లకు చెప్పింది. దీంతో.. ముగ్గురు కలిసి అతడిని నిత్యం వేధించేవారు. నువ్వు చేతగాని వాడివి కాబట్టే నీ భార్య మాతో అఫైర్ పెట్టుకుందని సూటిపోటి మాటలు అనేవారు. ఓ వైపు భార్య తన మాట వినకపోవడం, మరోవైపు ఆ ముగ్గురి వేధింపులతో ప్రహ్లాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

గ్రామంలో పరువు పోయాక బ్రతకడం అనవసరమని భావించి ఇంట్లోనే కరెంట్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్లహ్లాద్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో మహేశ్వరి అక్రమ సంబంధాల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో పోలీసులు మృతుడి భార్యతో పాటు ఆమె ముగ్గురు ప్రియుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.