బిగ్‌బ్రేకింగ్ : హీరో నాని ఇంటిపై ఐటీ దాడులు

By Medi Samrat  Published on  20 Nov 2019 12:28 PM IST
బిగ్‌బ్రేకింగ్ : హీరో నాని ఇంటిపై ఐటీ దాడులు

ఐటీ అధికారులు సినీ తారల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు. బుధవారం ఉద‌యం నుండి ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియో.. అలాగే వారిసంస్థ‌ల‌కు సంబంధించిన కార్యాల‌యాల‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇంట్లో ప్రస్తుతం ఐటీ అధికారుల ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని నాని ఇల్లు, కార్యాలయంలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నానితో పాటు.. మరికొంతమంది దర్శకులు, నిర్మాతలు, హీరోల ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 10 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు 10చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Next Story