కల్కి భగవాన్ కుమారుడు, కోడలను ప్రశ్నిస్తున్న అధికారులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2019 12:27 PM ISTచిత్తూరు జిల్లా: వరదాయపాలెం మండలం బత్తలవల్లం 'ఏకం కల్కి ఆధ్యాత్మిక' కేంద్రంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తమిళ నాడు నుంచి మొత్తం నాలుగు టీమ్‌లు 'ఏకం కల్కి ఆధ్యాత్మిక' కేంద్రంలో సోదాలకు దిగారు. నాలుగు టీమ్‌లు విడివిడిగా ఆధ్యాత్మిక కేంద్రంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు సోదాలు చేస్తున్నారు? ఎవరైనా ఫిర్యాదు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.'ఏకం కల్కి ఆధ్యాత్మిక' కేంద్రం కల్కివన్ నెస్ యూనివర్శిటీ ప్రాంగణంలో ఉంది.
అయితే..'ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రానికి ఎక్కువుగా విదేశీ భక్తులు వస్తుంటారు. అంతేకాదు..మన బాలీవుడ్ నుంచి కూడా ఎక్కవ మంది వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటుంటారు. అయితే...ఆశ్రమంలో అవినీతి జరిగిందా? .ఆశ్రమ నిర్వహకులు టాక్స్ విషయంలో ఏమైనా దారి తప్పారా?. తెలియాల్సి ఉంది. మొత్తానికి ఐటీ సోదాలు ఎందుకు చేస్తున్నారో తెలియనప్పటికీ ..భారీ ఎత్తున ఐటీ అధికారులు దిగినట్లు సమాచారం అందుతుంది.
ఏకం కల్కి ఆధ్యాత్మిక గ్రూప్‌కు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఉదయం నుంచి సోదాలకు దిగారు. మహారాష్ట్ర, తమిళనాడు కర్ణాటక ,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోనూ సోదాలు
కల్కి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ మీద భారీ ఎత్తున సోదాలకు దిగారు ఐటీ అధికారులు. ఫిలింనగర్ లోని ఆఫీస్, జూబిలీహిల్స్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అంతేకాదు.... స్టూడియో ఎన్ లో కూడా ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ..మణికొండలోని పంచవటి కాలనీలో స్టూడియో ఎన్ ఛానల్ ఉంది. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు దగ్గర నుంచి 2014లో ' ఏకం కల్కి ఆధ్యాత్మిక ' కేంద్రం వారు ఈ ఛానల్ కొన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ' ఏకం కల్కి ఆధ్యాత్మిక ' కేంద్రాలు, ఆఫీస్ ల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో భాగంగా స్టూడియో ఎన్ లో కూడా సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
కల్కిభగవాన్ కుమారుడు, కోడలను ప్రశ్నిస్తున్న అధికారులు
కల్కి భగవాన్ ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. కల్కి భగవాన్ ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. కాగా దాడులు సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్ నిర్వహాకుడు లోకేష్ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇక కల్కి ఆశ్రమాల్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు.