ఏషియన్ సినిమా అధినేతలు నారయణదాస్ ,సునీల్ నారంగ్ ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏషియన్ సంస్థ నాగచైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నైజాంలో భారీ చిత్రాలు ప్రమోట్ చేయడంతోపాటు, భారీ థియేటర్ల నిర్మాణం కూడా చేపట్టడం ఏషియన్ సంస్థ ప్రత్యేకత.

ఏఎంబీ థియేటర్ నిర్మాణం ప్రముఖ హీరో మహేష్ బాబుతో కలిసి వీరు చేపట్టారు.హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతుంది. అలానే ..స్కిల్ ప్రమోటర్స్‌ పై కూడా ఐటీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం అందుతుంది. సురేష్ దగ్గుబాటి వీరికి సంబంధించిన థియేటర్లలో ఎక్కువ సీట్ల షేర్ ఉన్నట్లు సమాచారం.

ఏషియన్ సినిమా , మల్టీఫ్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుంది. ఈ సంస్థకు నారాయణ దాస్, నారంగ్‌ భరత్ తోపాటు ఇతరులు డైరక్టర్లుగా ఉన్నారు.

it-attacks-on-asian-cinemas

it-attacks-on-asian-cinemas

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.