బాగ్దాది అంతంతో ఐసిస్‌ అంతమవుతుందా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 5:01 PM GMT
బాగ్దాది అంతంతో ఐసిస్‌ అంతమవుతుందా..?!

ఐసిస్ కథకు అతనే మూలం. ఆస్తికుడు కాస్తా మతోన్మాదిగా మారిపోయి ప్రపంచదేశాల్లో చిచ్చు రాజేశాడు. ఖలీఫా సామ్రాజ్య స్థాపన ప్రచారంతో వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాడు. చివరికి దిక్కు లేని చావు చచ్చాడు. మరి, అతని అంతంతో ఐసిస్ అంతమైనట్లేనా..? ఆ రాక్షసమూక మూలాలు ఇంకా ఎక్కడైనా ఉన్నా యా...?

బాగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవ్వద్ ఇబ్రహీం అల్ బద్రి. 1971లో ఇరాక్‌లోని సమర్రాలో జన్మించాడు. బాగ్దాదీ, మహమ్మద్ ప్రవక్త ఖురాయ్ష్ తెగ వారసులుగా చెప్పే సున్నీ అరబ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఖలీఫా కావడానికి ఇది కూడా ప్రధాన అర్హతల్లో ఒకటి. యువకుని డుగా ఉన్నప్పుడు అతను ఆస్తికునిగా ఉండేవా డు. మతాచారాలను పాటించేవాడు. ఇస్లామిక్ చట్టాలను చదివేవాడు. అప్పుడే బగ్దాదీ సలాఫిజం, జీహాదీజానికి దగ్గ రయ్యాడు. 1990లో స్కూల్ విద్య పూర్తి చేసి న బాగ్దాదీ, ఇరాక్ రాజధాని బాగ్దాద్ వెళ్లాడు. అక్కడ ఇస్లామిక్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఇస్లామిక యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఇరాక్‌ పరిణామాలు బాగ్దాదీ జీవితాన్ని మార్చివేశాయి.

అమెరికా సైనిక చర్యతో 2003లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైంది. అప్పుడే ఇస్లామిక్ స్టేట్ టెర్రరిజానికి పునాది పడింది. అమెరికా సంకీర్ణ సేనలపై జమాత్ జయేష్ అహ్ల్ అల్-సున్నావా-ఇ-జమా ఇస్లామిక్ గ్రూప్ దాడి చేసింది. ఈ సంస్థ ఆవిర్భావానికి బాగ్దాదీ సాయం చేశాడని చెబుతారు. అందులో అతను షరియా కమిటీకి అధిపతిగా ఉండేవాడు. 2004లో ఫలూజాలో బాగ్దాదీని అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని బుక్కా క్యాంపులో నిర్బంధించా యి. ఈ బుక్కా క్యాంపు జిహాదీ యూనివర్సిటీగా పేరు పొందింది. ఐసిస్ నాయకుల తయారీ కేంద్రంగా కూడా బుక్కా క్యాంపునకు పేరుంది. ఐసిస్ భవిష్యత్ నాయకుల తయారీ కేంద్రంగా బుక్యా క్యాంపును అభివర్ణిస్తారు. 10 నెలల తర్వాత అతన్ని వదిలేశారు. అదే టెర్రరిజాన్ని కొత్త మలుపు తిప్పింది.

బుక్కా క్యాప్ పరిచయాలే మలుపు..!

బుక్కా క్యాంపు వదిలిన తర్వాత ఇరాక్‌లో కొత్తగా ఏర్పడిన అల్ ఖైదా ఇన్ ఇరాక్‌-AQIతో బాగ్దాదీ సంబంధాలు పెట్టుకున్నాడు. 2006లో ఏక్యూఐ, ముజాహిదీన్ షురా కౌన్సిల్ అనే జీహాదీ రక్షణ సంస్థను సృష్టించింది. బాగ్దాదీ గ్రూప్ అందులో చేరింది. ఐతే, 2006 చివర్లో అమెరికా వైమానిక దాడుల్లో జరకవీ చనిపోయా డు. అదే సమయంలో సంస్థ పేరును ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్-ISIగా మార్చారు. 2010లో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ఐ నాయకుడు అబూ ఉమర్ అల్-బగ్దాదీ, అతని డిప్యూటీ అబూ అయ్యూబ్ అల్-మస్రీ మరణించారు. దాంతో ఐఎస్‌ఐ పగ్గాలు బాగ్దాదీ చేతికి వచ్చాయి.

ఐసిస్ కు ప్రాణం పోసిన బాగ్దాది

అమెరికా వైమానిక దాడులతో ఐఎస్‌ఐ తీవ్రంగా దెబ్బతింది. ఓ దశలో ఓటమి అంచుకు చేరింది. ఆ సమయంలో ఐఎస్‌ఐకి బాగ్దాదీ నాయకుడయ్యాడు. అతనికి సద్దాం హుస్సేన్‌ సైన్యంలో పని చేసిన సైనికులు, నిఘా అధికారులు, బుక్కా క్యాంపులో అతడిని ఉన్న మాజీ ఖైదీలు చేయి కలిపారు. వారందరితో కలసి I.S.Iని పునర్ నిర్మించాడు. 2013లో ఒకే నెలలో పదికి పైగా దాడులు చేయించాడు. ఇది మిగతా టెర్రరిస్టు గ్రూపు లను ఆకర్షించింది. సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌పై తిరుగుబాటు చేస్తున్న మిలిటెంట్లు కూడా బాగ్దాదీతో చేతులు కలిపారు. 2013 ఏప్రిల్‌లో ఇరాక్, సిరియా లోని దళాలను విలీనం చేసి ఐసిస్‌ను ఏర్పాటు చేశారు.

ఇరాక్ లోకి దూసుకొచ్చిన ఐసిస్ సేనలు

ఇరాక్‌లో ఐసిస్ తీవ్రస్థాయిలో విజృంభించింది. సద్దాం హుస్సేన్ విశ్వాస పాత్రు లు, గిరిజన తెగల సాయంతో ఫలూజాకు విస్తరించింది. 2014 జూన్‌లో వేలాది ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు మోసూల్ నగరాన్ని ఆక్రమించారు. తర్వాత రాజాధాని బాగ్దాద్ వైపు దూసుకొచ్చారు. జూన్ చివరినాటికి ఇరాక్‌లోని చాలా నగ రాలు, పట్టణాలపై పట్టు సాధించిన ఐసిస్, షరియాకు అనుగుణంగా ఖలీఫా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రక టించింది. దానికి ఇస్లామిక్ స్టేట్ అని పేరు పెట్టింది. బాగ్దాదీని ఖలీ ఫా ఇబ్రహీంగా ప్రకటించింది.

మొట్టమొదటిసారి వీడియోల ముందుకు బాగ్దాది

ఖలీఫా సామ్రాజ్య స్థాపనం తర్వాత మోసుల్‌లోని ప్రముఖ మసీదు అల్-నూరీ నుంచి బాగ్దాదీ ప్రసంగించాడు. కెమెరా ముందు అతను కనిపించడం అదే మొదటిసారి. మతాన్ని నమ్మనివారితో పోరాటం చేయడానికి మతాన్ని విశ్వసించే ముస్లింలు ఐసిస్ భూభాగంలోకి వలస రావాలని బాగ్దాదీ పిలుపునిచ్చాడు. ఆ తర్వా త ఐఎస్ మిలిటెంట్లు ఇరాక్‌లో కుర్దిష్ మైనారిటీల అదుపులో ఉన్న ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లారు. యాజ్దీ మతానికి చెందిన వేలాది మందిని ఊచకోత కోశారు. యాజ్దీ మహిళలు, అమ్మాయిలను చెరబట్టారు. వారిని దారుణంగా వేధించారు. గ్యాంగ్‌రేప్‌లు, బలవంతపు అమ్మకాలతో స్త్రీలను ఛిత్రవధ చేశారు. సిరియాతో పాటు చాలా దేశాల్లో భయంకరమైన దాడులు చేశారు. ముఖ్యంగా పశ్చిమ దేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఐసిస్‌ పూర్తి బలంతో ఉన్న సమయంలో పశ్చిమ సిరియా నుంచి తూర్పు ఇరాక్ వరకూ 88 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంపై పట్టు సాధించింది. దాదాపు 80 లక్షల మందిపై క్రూర పాలన అమలు చేసింది.

చమురే ఆర్ధిక వనరు..!

చమురు, దోపిడీ, కిడ్నాపింగ్ ద్వారా వందల కోట్ల డాలర్లు సంపాదించింది. ఐసిస్ వ్యవహారం ప్రాణాంతకంగా మారడంతో మళ్లీ అమెరికా రంగంలోకి దిగింది. 2014 సెప్టెంబర్‌లో మొదలైన ఆపరేషన్ ఐదేళ్లపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఇరాక్‌లోని నగరాలు, పట్టణాల నుంచి ఐసిస్ ఉగ్రవాదులను నిర్మూలించారు. సిరియాలోనూ ఐసిస్‌ ఉగ్రవాదులను చాలా మందిని హతమార్చారు. 2019 మార్చిలో ఐఎస్ అధీనంలో ఉన్న సిరియాలోని చివరి ప్రాంతమైన బఘుజ్ గ్రామం కూడా సంకీర్ణ బలగాల చేతుల్లోకి వచ్చింది. దాంతో, బాగ్దాదీ ఖలీఫా సామ్రాజ్యానికి తెర పడింది. బాగ్దాదీపై రూ.177 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఐదేళ్ల క్రితం ఐసిస్ ఆవిర్భవించినప్పటి నుంచి అమెరికా సంకీర్ణ సేనలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.

బాగ్దాది చనిపోతే ఐసిస్ చనిపోతుందా?!

2019 ఏప్రిల్‌లో బాగ్దాదీ ఒక వీడియోలో కనిపించాడు. ఐతే, మోసూల్‌ లోని మసీదు నుంచి ప్రసంగించకుండా, ఒక గదిలో తన పక్కనే రైఫిల్ పెట్టుకుని కనిపించా డు. ఇక, అక్టోబర్ 22న అమెరికా ప్రత్యేక దళాలు ఇడ్లిబ్‌ ప్రావిన్సులో దాడి చేశాయి. ఈ దాడుల్లోనే బాగ్దాదీ హతమయ్యాడు. ఐతే, బాగ్దాదీ హతంతోనే ఐసిస్‌కు తెరపడినట్లు భావించలేమని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐసిస్ మూలాలు ఇంకా ఉన్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Story