Fact Check : ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ 8 కేరళ బ్యూరోలను మూసివేస్తోందా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2020 12:39 AM GMT
Fact Check : ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ 8 కేరళ బ్యూరోలను మూసివేస్తోందా.?

లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. రాబోయే కాలంలో కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో రూమర్స్ కూడా ఉద్యోగులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్', కేరళ కు పనిచేసే ఉద్యోగుల్లో కూడా కొత్త టెన్షన్ మొదలైంది. ఆ న్యూస్ పేపర్ కు చెందిన ఎనిమిది బ్యూరోలను మూసి వేస్తున్నారని వార్త రావడంతో అందులో పని చేసే ఉద్యోగులు చాలా భయపడ్డారు.

కేరళకు చెందిన ఇండిపెండెంట్ న్యూస్ పోర్టల్ 'THE KOCHI POST' ఆదివారం నాడు ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కేరళలోని ఎనిమిది బ్యూరోలను మే 31 నాటికి మూసివేస్తోందని ప్రచురించింది. అలప్పూజా, త్రిసూర్, పతనంతిట్ట, కొల్లామ్, కొట్టాయం, పాలక్కాడ్, కన్నూర్, మలప్పురంలోని బ్యూరో ఆఫీసులను ఉన్నపలంగా మూసివేస్తున్నారని.. అందులోని ఫర్నీచర్ ను స్క్రాప్(పాత సామాన్ల వాళ్లకు)కు ఇచ్చేస్తున్నారంటూ కథనాన్ని ప్రచురించింది.

“Media shocker: The New Indian Express to shut 8 bureau offices in Kerala,” అంటూ ఆర్టికల్ ను ప్రచురించింది. స్టాఫ్ మొత్తాన్ని తగ్గించి రెంట్ కు ఓ చిన్న ఆఫీసును తీసుకుని ఇద్దరు లేదా ముగ్గురితో పని పూర్తీ చేయిస్తారంటూ అందులో తెలిపింది. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారని.. ఈ విషయం వారికి తెలీదని అందులో పేర్కొంది. మేనేజ్మెంట్ ఒక్కో బ్యూరోను మూసివేయడం ద్వారా లక్ష రూపాయలు మిగిలించుకోవాలని భావిస్తోందని అందులో రాసుకొని వచ్చారు.



ఈ విషయాన్ని సదరు వార్తా సంస్థ.. తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా ట్వీట్ చేసింది. ఇది నిజమేనన్న పలువురు మీడియా మిత్రులు దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.





నిజమెంత:

ఈ ఆర్టికల్ పై న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన కేరళ ఉద్యోగితో మాట్లాడడం కూడా జరిగింది. బ్యూరో అన్నది బిల్డింగ్ తో కూడుకున్నది కాదని.. రిపోర్టర్స్, ఫోటో జర్నలిస్టులు, మిగిలిన స్టాఫ్ మెంబర్స్ కలిస్తేనే బ్యూరో అవుతుందని సదరు ఉద్యోగి తెలిపారు. అలప్పూజా, త్రిసూర్, పతనంతిట్ట, కొల్లామ్, కొట్టాయం, పాలక్కాడ్, కన్నూర్, మలప్పురంలో ఉన్నది కేవలం వన్ మ్యాన్ బ్యూరో(ఒక్కరే రిపోర్టర్ పని చేస్తూ ఉంటారు) అని తెలిపారు. లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటి నుండి వారందరూ ఇళ్లల్లో ఉండే తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారని తెలిపారు. బ్యూరో ఆఫీసులు నెల కంటే ఎక్కువ రోజుల నుండి ఖాళీగానే ఉన్నాయని అన్నారు. తిరిగి ఆఫీసుల్లోకి వెళ్లాలా వద్దా అన్నది తాము ఆలోచిస్తూ ఉన్నామని అన్నారు.

THE KOCHI POST మే 16న టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కేరళ లోని బ్యూరోలను తీసి వేసిందంటూ కథనాలను ప్రచురించింది.

ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికే 10 నుండి 30 శాతం జీతాలతో కోతను విధించింది. ఇప్పటి వరకూ ఎవరినీ తీసివేయలేదు. ఇలాంటి ఆర్టికల్స్ కేవలం ఉద్యోగుల్లో టెన్షన్ ను మాత్రమే తీసుకుని వస్తాయని ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగి తెలిపారు. డెక్కన్ క్రానికల్ డిసెంబర్ 2019 లోనే కేరళ లోని ఎడిషన్స్ కు గుడ్ బై చెప్పేసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రం కేరళలో ఏడు ఎడిషన్స్, 14 జిల్లాల్లో అన్ని బ్యూరోలను ఓపెన్ చేసి ఉంచింది.

లాక్ డౌన్ ప్రభావం మీడియా మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నో మీడియా సంస్థలు ఉద్యోగులను తీసేయడమో, శాలరీ లేకుండా లీవ్ లు తీసుకోమనో చెప్పేశాయి.

నిజం ఏమిటి: పైన చెప్పినట్లుగా ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ 8 బ్యూరోలను కేరళలో మూసివేస్తున్నట్లు వచ్చిన పోస్టు మొత్తం అబద్ధం. బ్యూరో ఆఫీసులను మూసి వేసి.. వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ను సంస్థ కేటాయించింది. ఇప్పటి వరకూ ఎవరినీ ఉద్యోగం నుండి తీసివేయలేదు.

Claim Review:Fact Check : ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ 8 కేరళ బ్యూరోలను మూసివేస్తోందా.?
Claim Fact Check:false
Next Story