చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. ప్రజా వ్యతిరేఖ నాయకుడా?
By Newsmeter.Network Published on 27 March 2020 12:20 PM ISTఏపీలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలోనూ, లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడంలోనూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని, దేశం మొత్తం నేడు ఏపీ వైపు చూసేలా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అది తట్టుకోలేక జగన్మోహన్‌రెడ్డిపై బుదరజల్లుతున్నారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల్లో ఉంటూ, ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ.. వారికి అవసరమైన నిత్యావసరాలను వారి ఇండ్లకు వెళ్లి ఇస్తున్నారని, కానీ లేని భయాలను చంద్రబాబు ప్రజల్లో కల్పించేలా మాట్లాడటం సరికాదని రోజా హితవు పలికారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉంటూ, కుప్పంకు ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఇప్పటి వరకు కుప్పంకు వెళ్లి ప్రజలు ఎలా ఉన్నారో కూడా గమనించని వ్యక్తి చంద్రబాబు అంటూ రోజా మండిపడ్డారు. ఆయన కొడుకు కూడా మంగళగిరి వెళ్లి అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూడకుండా ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
Also Read :యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ.. సస్పెండ్ చేసిన డీజీపీ
ఏపీలో రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇలా అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం తెలంగాణలో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెడుతున్నాడని, అసలు చంద్రబాబు ఏపీకి ప్రతిపక్ష నాయకుడా..? తెలంగాణకు ప్రతిపక్ష నాయకుడా అంటూ రోజా విమర్శలు గుప్పించారు. దేశం మొత్తం కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఏపీలో 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జగన్మోహన్‌రెడ్డి ఈ ఏవిధంగా కృషి చేస్తున్నారో చంద్రబాబు గమనించాలని సూచించారు.
Also Read :ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి అభినందనలు
కరోనా అనుమానితులను పరీక్షించేందుకు 18వేల బెడ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగిందని, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో 200 బెడ్స్, ప్రతీ నియోజకవర్గంలో 100 బెడ్స్‌ను ఏర్పాటు చేయటం జరిగిందని రోజా తెలిపారు. నాలుగు ప్రత్యేక కరోనా ఆస్పత్రులను 2వేల బడ్స్‌తో విజయవాడ, తిరుపతి, వైజాగ్, నెల్లూరులో కూడా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఎక్కడైనా పాజిటివ్ వస్తే అక్కడికి పంపించేలా ఏర్పాట్లు చేయటం జరిగిందని తెలిపారు. ఇంటికే నెలకు సరుకులు ఇవ్వటమే కాకుండా, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడకూదడని ప్రతీఒక్కరికి 4వ తేదీన రేషన్ ఇచ్చేలా ఏర్పాటు చేయటం జరిగిందని, గోరుముద్దలు పథకంలో భాగంగా న్యూట్రీషన్ ఫుడ్ చిన్న పిల్లలు దూరం కావద్దని, ఇంటికే పంపించేలా జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని రోజా అన్నారు.
Also Read :కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. మూడు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం
ఇంత అద్భుతంగా పనిచేస్తున్న జగన్‌పై విమర్శలు చేయటం చంద్రబాబుకు పద్దతి కాదని హితవు పలికారు. గతంలో చంద్రబాబు పాలనలో కేవలం పబ్లిసిటీకే పరిమితమయ్యారని, కానీ నేడు జగన్మోహన్‌రెడ్డి మాత్రం పబ్లిసిటికి పెద్దపీట వేయకుండా ప్రజలకు మేలు జరిగేలా, కరోనా వైరస్ నుంచి వారిని దూరంగా ఉంచేలా అన్ని చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఇప్పటికైన చంద్రబాబు తన బుద్ది మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే గట్టిగుణపాఠం చెబుతారని రోజా హెచ్చరించారు.