Fact Check : టీటీడీ సప్తగిరి పత్రికతో పాటూ సజీవ సువార్త అనే పత్రికను కూడా పంపిస్తోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2020 7:18 PM IST
Fact Check : టీటీడీ సప్తగిరి పత్రికతో పాటూ సజీవ సువార్త అనే పత్రికను కూడా పంపిస్తోందా..?

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే ఎంతో ఫేమస్. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాలు టీటీడీని చుట్టుముడుతున్నాయి. టీటీడీ అధికార మ్యాగజైన్ అయిన సప్తగిరితో పాటూ క్రైస్తవ మ్యాగజైన్ అయిన 'సజీవ సువార్త' పత్రికను పంపారంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడంతో మరో వివాదం చెలరేగింది.

టీటీడీ మాస పత్రిక సప్తగిరితో పాటూ సజీవ సువార్తను పంపారన్న పోస్టును పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్ట దిగజార్చేందుకు కొందరు కావాలనే ఇలా అన్యమత ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారని పోస్టులు పెడుతున్నారు.

ఎంతో మంది ఫేస్ బుక్ లో ఈ పోస్టును పెట్టారు.

సప్తగిరి పత్రికతో పాటూ మరో మతానికి చెందిన పత్రిక తనకు వచ్చిందంటూ ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.



“Sir, I have a subscription to TTD monthly magazine Saptagiri. This month, I got Saptagiri book along with a booklet promoting Christianity. There are allegations that the TTD funds were used to promote other religions. Please see this issue."

తాను టీటీడీ సప్తగిరి మాస పత్రిక చందాదారుడినని, ఈ పత్రికతో పాటూ క్రిస్టియానిటీకి చెందిన మరో పుస్తకం కూడా వచ్చిందని.. టీటీడీ ఫండ్స్ తో ఇతర మతాలను ప్రచారం చేస్తున్నారా..? ఈ సమస్యను పరిష్కరించండి అని కోరారు.

“Is it true that TTD gives Saptagiri monthly to post office and they paste addresses and send by Book Post? TTD pays Rs 1.05/issue in addition to postal charges? Insertion of Xtian magazine would well have taken place in PO. Please clarify @yvsubbareddymp”

సప్తగిరి మాసపత్రికకు పోస్టల్ ఛార్జీల కింద 1.05 రూపాయలను టీటీడీ ఇస్తున్నా కూడా ఇతర మతాలకు చెందిన పత్రిక ఎలా వచ్చింది అని పలువురు ట్విట్టర్ ద్వారా అడిగారు.

నిజనిర్ధారణ:

సప్తగిరి మాస పత్రికతో పాటూ ఇతర మతాలకు చెందిన పత్రికలను పంపుతూ ఉన్నారన్నది 'పచ్చి అబద్ధం'

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఎన్వలోప్ ప్రకారం.. ఆ మాస పత్రికను వేయించుకున్న వ్యక్తి గుంటూరుకు చెందిన వారు. ఇతర పోస్టుల్లో ఎక్కడ కూడా అడ్రెస్ కనిపించలేదు.

ఈ ఘటన గురించి బయటకు రాగా సప్తగిరి మాసపత్రిక ఇంఛార్జ్, ఛీఫ్ ఎడిటర్ రాజగోపాలన్ దీనిపై స్పందించారు. సప్తగిరి ఆఫీసులో పత్రికను ప్యాక్ చేసే సమయంలో ఎటువంటి ఇతర ప్రింట్ మెటీరియల్ ను పంపించము. మ్యాగజైన్ ప్రింట్ అయిన వెంటనే పత్రిక కాపీలైన సప్తగిరి, బాలా సప్తగిరిలను పోస్టల్ స్టాఫ్ కు అందజేస్తాం. అవి పోస్టల్ వ్యాన్ లో సదరు పోస్ట్ ఆఫీసులకు చేరుకొని.. ఎవరైతే మాసపత్రికలను తీసుకుంటారో.. వారికి అందుతాయి.

https://www.thehansindia.com/andhra-pradesh/row-over-supply-of-other-religious-material-along-with-sapthagiri-ttd-denies-any-role-632178

గుంటూరుకు చెందిన చందాదారుడు మాత్రమే తనకు సప్తగిరి పత్రికతో పాటూ ఇతర మతానికి చెందిన పత్రిక వచ్చిందని తెలిపాడు. ఇతర ప్రాంతానికి చెందిన చందాదారులెవరూ తమకు ఇతర మతాలకు చెందిన పత్రికలు వచ్చాయని చెప్పలేదు. టీటీడీ కూడా పలువురు చందాదారులకు ఫోన్స్ చేసి అడుగగా తమకు ఎటువంటి ఇతర మతాలకు చెందిన పత్రికలు రాలేదని తేల్చి చెప్పారు. ఇది ఎవరో కావాలనే చేశారని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును చేస్తున్నారు.

https://www.thehindu.com/news/national/andhra-pradesh/ttd-takes-serious-view-of-propaganda-against-it/article32006550.ece

https://www.sakshi.com/video/news/ttd-sapthagiri-magazine-controversy-1299770

తిరుమల తిరుపతి దేవస్థానం ఇతర మతాలకు చెందిన మ్యాగజైన్ లను తమ మాస పత్రిక అయిన సప్తగిరితో పాటూ పంపిస్తోందన్నది 'పచ్చి అబద్ధం'. కొందరు కావాలనే టీటీడీ ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన ప్రయత్నమని అంటున్నారు.

Next Story