ఇమ్రాన్‌ పంచ్‌లకు మురిసిపోయిన సచిన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 5:06 PM IST
ఇమ్రాన్‌ పంచ్‌లకు మురిసిపోయిన సచిన్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌తో మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కుమారుడు బాక్సింగ్‌ చేశారు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు ఆడుతున్నారు. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌కు ఇర్ఫాన్‌ తన కుమారుడిని తీసుకొచ్చాడు. ఆ చిన్నారితో సచిన్‌ సరదాగా ఆడుకున్నాడు.

ఈవీడియోను ఇర్ఫాన్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 'ఇమ్రాన్‌ ఏం చేశాడో వాడికి తెలీదు. పెద్దయ్యాక కచ్చితంగా బాక్సర్‌ అవుతాడు. సచిన్‌తో బ్యాకింగ్‌ చేశాడు' అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు ఈ బరోడా పేసర్‌.

ఈ వీడియో చూసిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్.. ఇర్ఫాన్‌కు రీట్వీట్‌ చేశాడు. 'చిన్నారులతో సమయాన్ని పంచుకోవడం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. ఇమ్రాన్‌.. ఒక రోజు నీ కండలు.. నా కన్నా.. మీ నాన్న కన్నా చాలా దృఢంగా ఉంటాయి' అని సచిన్‌ తెలిపాడు.

ఆ వీడియోతో ఏం ఉందంటే..

ఓ టేబుల్‌పై నిల్చున్న ఇమ్రాన్.. సచిన్‌ కంటే తానే ఎత్తుగా ఉన్నానంటూ చెప్పాడు. అంతేకాదు తన కండలు చూపిస్తూ.. సచిన్‌పై బాక్సింగ్ పంచ్‌లు విసిరాడు. ఇమ్రాన్ అమాయకత్వంతో చేస్తున్న పనికి సచిన్ మురిసిపోయాడు.

దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాహనదారులు, ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫండ్స్‌ సేకరణ కోసం ఐదు దేశాల మాజీ క్రికెటర్లతో ఈ రోడ్ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ని నిర్వహిస్తోంది. భారత్‌ నుంచి ఇండియా లెజెండ్స్ టీమ్ తరహాలోనే ఆస్ట్రేలియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ రూపంలో మొత్తం ఐదు జట్లు టోర్నీలో ఆడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లన్నీ ముంబయి, పుణెలో.. మార్చి 7 నుంచి 22 వరకూ రాత్రి 7 గంటలకి జరగనున్నాయి.



Next Story