ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇరగదీశాడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2020 12:02 PM GMT
ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇరగదీశాడు..

ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ బ్యాటింగ్‌లో విజృంభించడంతో ఇండియాలెజెండ్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. రోడ్డు సేప్టీ సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పఠాన్‌ చెలరేగిన వేళ ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సచిన్‌, సెహ్వాగ్‌ విన్యాసాలను కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తే.. వారిద్దరు నిరాశపరిచారు. అయితే నేం.. నేనున్నానంటూ ఇర్ఫాన్‌ ఫోర్లు సిక్సర్లతో విరుచుకపడ్డాడు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక లెజెండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దిల్షాన్‌ (23), కపుగెడెర (23) రాణించారు. మునాఫ్ పటేల్‌ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ సచిన్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరగా సెహ్వాగ్‌(3), యూవీ(1) తక్కువ పరుగులకే ఔటైయ్యారు. దీంతో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ ను సంజయ్‌బంగర్‌(18), కైఫ్‌(46; 45బంతుల్లో 4పోర్లు, 1సిక్స్‌)లు కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటైయ్యారు. 15 ఓవర్‌లో కైఫ్‌ అవుటైయ్యే సమయానికి స్కోర్‌ 81 మాత్రమే. చివరి 32 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో గెలుపు కష్టం అనిపించింది. కానీ చెలరేగి ఆడిన ఇర్ఫాన్‌ పఠాన్‌ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. పఠాన్‌ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. కాగా పఠాన్‌ 31 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. అంతముందు బౌలింగ్‌ వేసిన పఠాన్‌ కీలకమైన తిలకరత్నే దిల్షాన్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

Next Story
Share it