అమెరికా శాంతి మంత్రం వెనుక కారణం అదేనా ..?

By సుభాష్  Published on  11 Jan 2020 2:15 AM GMT
అమెరికా శాంతి మంత్రం వెనుక కారణం అదేనా ..?

ఇరాన్‌ - అమెరికాల మధ్య ఉద్రిక్తలు కీలక మలుపు తిరిగాయి. ఒకవైపు ఇరాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణుల దాడి నిర్వహించగా, మరో వైపు అమెరికా శాంతి మంత్రం జపిస్తోంది. ఇరాన్‌ క్షిపణుల దాడిలో తమ సైనికులెవ్వరు మరణించలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత మేర నష్టం వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

తాము శాంతిని కోరుకునే వారందరితో శాంతియుత సంబంధాలు మాత్రమే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థలను నిర్మూలించేందుకు కలిసి రావాలని ఇరాన్‌ను కోరారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్‌ అసద్‌, ఇర్బిల్‌ మిలటరీ స్థావరాలపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. ఈదాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ప్రకటించింది ఇరాన్‌. ఈ దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ఇక అమెరికాకు భయపడి వెనక్కి వెళ్లేది లేదని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ పేర్కొన్నారు.

ఇరాన్‌ సైనిక జనరల్‌ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్‌ అధికార టీవీ ప్రకటించింది. అమెరికా సైనికులు ఉన్న రెండు స్థావరాలపై 22 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఇరాక్‌ సైనికులెవ్వరికి గాయాలు కాలేదని ఇరాక్‌ మిలటరీ ప్రకటించింది. నేరానికి పాల్పడితే తగిన గుణపాఠం ఉంటుందని అమెరికాకు తెలిసి రావాలని ఇరాన్‌ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇరాన్‌ క్షిపణి దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ, మూడో ప్రపంచ యుద్దానికి తెరలేపనుందనే ఉహాగానాలు కూడా మొదలయ్యాయి.

శాంతిని కోరుకుంటాం..

ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడారు. శాంతిని కోరుకునే అందరితో అమెరికా సామరస్యపూర్వక సంబంధాలనే కోరుకుంటుందని అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఇరాన్‌ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో ప్రపంచదేశాలు మరింత సమర్థవంతమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవల్సి ఉందన్నారు. ఇరాన్‌ ఆర్మీచీఫ్‌ సులేమానీనీ ‌క్రూరుడైన ఉగ్రవాదిగా ట్రంప్‌ మరోసారి అభివర్ణించారు. అదే సమయంలో, ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోనని ప్రతినబూనారు.

‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఇరాన్‌ అణ్వాయుధ దేశం కాబోదు’ అన్నారు. ఇరాన్‌ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో ప్రపంచ దేశాలు మరింత సమర్ధవంతమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. సులేమానీని క్రూరుడైన ఉగ్రవాదిగా ట్రంప్‌ మరోసారి అభివర్ణించారు. అమెరికా, ఇరాన్‌ రక్తంలో సులేమానీ చేతులు తడిచాయన్న ట్రంప్‌.. అతడిని అంతమొందించడం ద్వారా ఉగ్రవాదులకు కఠిన సందేశమిచ్చామన్నారు. అమెరికా, ఇరాన్‌ రక్తంతో సులేమానీ చేతులు తడిచాయన్న ట్రంప్‌.. అతడిని అంతమొందించడం ద్వారా ఉగ్రవాదులకు కఠిన సందేశమిచ్చామన్నారు.

ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బగ్దాదీని అంతమొందించడం వల్ల ఇరాన్‌కు మంచి జరిగిందని ట్రంప్‌ వ్యాఖ్యనించారు. మరోవైపు ఇరాన్‌పై తక్షణమే మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించనున్నామని ఆయన ప్రకటించారు. ఇరాన్‌ తమ తీరును మార్చుకునే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్‌ దాడి చేసిన సైనిక స్థావరాల్లో సైనికులంతా క్షేమంగానే ఉన్నారన్నారు.

Next Story