దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
By సుభాష్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పట్టి పీడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 230 దేశాలకుపైగా చాపకింద నీరులా వ్యాప్తించి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాకు వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ నేపథ్‌యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని కరోనా కేసుల సంఖ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తమ దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సోకిందని పేర్కొన్నారు. మున్ముందు కరోనా కేసులు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని నెలల వ్యవధిలోనే మూడున్నర కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. గత 150 రోజుల్లో ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరిన వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని, రాబోయే రోజుల్లో మరింత మంది చేరే అవకాశం ఉందని రౌహాని అన్నారు. కరోనా తీవ్రతను గుర్తించుకుని ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భయంకరంగా ఉందని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందన్నారు.
కొన్ని నెలల వ్యవధిలోనే 3.5 కోట్ల మందికి కరోనా
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి రానున్న రోజుల్లో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రధాని రౌహాని అన్నారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యశాఖ అధ్యయనంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. రాబోయే నెలల్లో మూడున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని రౌహాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే కేసులు పెరుగుతాయని వేటి ఆధారంగా నివేదికను రూపొందించారో ఇరాన్ అధికారులు వెల్లడించలేదు.
కాగా, ఫిబ్రవరిలో 2 లక్షల 70వేల కేసులకుపైగా నమోదు కాగా, 13,979 మంది మరణించారు. అయితే ఆ దేశ అధ్యక్షుడి లెక్కల ప్రకారం.. చూసుకుంటే ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లో మళ్లీ ఆంక్షలు విధించారు. జనాలు అధిక సంఖ్యలో గుమిగూడే వ్యాపార, వాణిజ్య ప్రాంతాలను సైతం మూసివేయనున్నారు. ఇప్పుడు అధికారిక గణాంకాల కన్నా మృతుల సంఖ్య కూడా రెట్టింపు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ చాలా చిన్నదేశం. ఆ దేశ జనాభా 2018 లెక్కల ప్రకారం.. 8.81 కోట్లు. అందులో రెండున్నర కోట్ల మందికి కరోనా సోకిందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా ప్రకటించడం గమనార్హం.