భార్య ఫిర్యాదుతో ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వరరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

By సుభాష్  Published on  14 Dec 2019 9:24 PM IST
భార్య ఫిర్యాదుతో ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వరరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ఐపీఎస్‌ ట్రైనీ అధికారిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ శిక్షణ నుంచి సస్పెన్షన్‌ కొనసాగుతుందని కేంద్రం తేల్చి చెప్పింది. వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డి తనను మోసం చేశాడంటూ భావన గతంలో హోంశాఖతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు మహేశ్వరరెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

IPS trainee accused 1

భావనకు మహేష్‌తో ఉస్మానియ యూనివర్సిటీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం పెళ్లి వరకు దారి తీసింద. కాగా, ఏడాదిన్నర క్రితం మహేశ్వరరెడ్డి, భావన కీసర రిజిస్ట్రర్‌ కార్యాలయంలో వివాహం జరిగింది. వీళిద్దరు గత కొంత కాలంగా బాగానే కలిసే ఉన్నారు. మహేశ్వరరెడ్డి ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మరో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని, విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని భావన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై జవహర్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story