ఐపీఎల్‌ వేలం.. అత్యధిక ధర పలికింది ఈ ఆటగాడే

By సుభాష్
Published on : 19 Dec 2019 5:27 PM IST

ఐపీఎల్‌ వేలం.. అత్యధిక ధర పలికింది ఈ ఆటగాడే

వచ్చే సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 (ఐపీఎల్‌)కు సంబంధించి వేలం ఆరంభమైంది. ఐపీఎల్ వేలంలో విదేశీ ఆటగాడు ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ రికార్డుకెక్కాడు. వేలంలోఅత్యధిక ధర పలికాడు. అతడి బేస్ ప్రైస్ రూ.2 కోట్లు కాగా, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాలు అతడిని చేజిక్కించుకునేందుకు పోటీలో తలపడ్డారు. చివరికి కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.15.5 కోట్లతో అతడిని దక్కించుకుంది. ఫలితంగా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ రికార్డుల్లో నమోదయ్యాడు.

Ipl Auctions 2020

ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్‌ను ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంచైజీ రూ.1.5 కోట్లతో కొనుగోలు చేయగా, శామ్ కరన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంకా ఈ వేలం పాట కొనసాగుతోంది.

Next Story