జియోలో సౌదీ కంపెనీ పెట్టుబడి

By సుభాష్  Published on  19 Jun 2020 10:05 AM IST
జియోలో సౌదీ కంపెనీ పెట్టుబడి

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్‌ జియో ప్లాంట్‌ఫాంలో 9 వారాల్లో 11వ పెట్టుబడి వచ్చింది చేరింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ అతిపెద్ద సావరీన్‌వెల్త్‌ ఫండ్‌ప పీఐఎఫ్‌ రూ.11,367 కోట్ల పెట్టుబడితో 2.32 శాతం వాటాను దక్కించుకుంది. తాజా వాటా విక్రయంతో జియో ప్లాట్‌ఫాంతో రిలయన్స్‌ 24.70 శాతం వాటాను విక్రయించినట్లయింది. అంతేకాదు రూ. 1,15,693,95 కోట్లు సమీకరించింది.

ఇక రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటి వ్యాల్యూ, రూ.5.16 లక్షల కోట్లు ఎంటర్‌ ప్రైజ్‌ వ్యాల్యూ వద్ద పీఐఎఫ్‌ ఈ పెట్టుబడులు పెట్టింది. ఏప్రిల్‌ 22న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ రూ.43,574 కోట్ల పెట్టుబడి పెట్టి, 9.99శతం వాటాను దక్కించుకుంది. అప్పటి నుంచి వరుసగా పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. ఓ కంపెనీ మాత్రం రెండుసార్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఫేస్‌బుక్‌ తర్వాత వివిధ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కాగా, పీఐఎఫ్‌ 1971లో స్థాపించబడింది. 400 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో అతిపెద్ద సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌ లో ఒకటిగా ఉంది.

ఎవరి వాటా ఎంత?

► ఫేస్‌ బుక్‌ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా

► PIF - రూ.11,367 కోట్లు - 2.32 శాతం వాటా

► సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా

► విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

► జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా

► కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

► ఏడీఐఏ - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా

► ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా

► ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా

► సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా

► TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా

Next Story