ట్రంప్ వాడిన కరోనా మందు‌ క్లినికల్ ట్రయిల్స్ కు అనుమతి కోరిన ఫార్మా కంపెనీ

Zydus Cadila seeks DCGI approval for clinical trial. మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌‌కు అనుమతివ్వాలని కోరుతూ.. ఫార్మా కంపెనీ జైడస్‌ క్యాడిలా కోరింది.

By Medi Samrat  Published on  27 May 2021 10:34 AM GMT
Zydus Cadila

మన అందరం కరోనాకి డాక్టర్లు ఏ మందు చెప్పారో, ఉన్నవాటిలో ఏ మందు అవైలబుల్ ఉందో అదే వేసుకున్నాం.. కానీ సెలబ్రిటీలు ఎలాంటి మందులు వాడారు, దేశాధ్యక్షులు ఎలాంటి మెడిసన్ తీసుకొని కోలుకున్నారు అనేది చాలా రోజుల వరకు బయటకు రాదు. మిగతావాళ్ళ సంగతి పక్కన పెడితే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు పాజిటివ్‌ వచ్చినపుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ అనే ఔషదం వాడారు. ట్రంప్‌కు ఈ ఔష‌ధాన్ని ప్రయోగాత్మకంగా ఇవ్వగా ఆయన రెండు రోజుల్లోనే కోలుకుని మళ్లీ ఎన్నిక‌ల‌ ప్రచారానికి వెళ్లగలిగారు.

ఇప్పుడు దీనిని మన దేశంలో తొలిసారి వినియోగించారు. హర్యానాలో ఒక వ్యక్తికి ఇవ్వగా అతడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మొహబత్‌సింగ్ కి యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును ఇచ్చామని, ఆయన పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు మేదాంత ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నరేశ్ తెహ్రాన్ తెలిపారు.

ఈ వాక్సిన్ ఆసుపత్రికి వెళ్లే అవసరాన్ని 70 శాతం తగ్గిస్తుందని చెబుతున్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ ఔషధాన్ని అమెరికాకు చెందిన రోచె సంస్థ అభివృద్ధి చేసింది. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమం ఇది. ఒక్కో ప్యాక్‌లో రెండు డోసులు ఉంటాయి. ఒక్కో డోసు సుమారు 50 వేలు, అంటే 2 డోసులు కలిపి లక్ష రూపాయల పైమాటే. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను భారత్‌లో విడుదల చేశారు. ప్రముఖ ఆసుపత్రులు, కొవిడ్ చికిత్సా కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌‌కు అనుమతివ్వాలని కోరుతూ.. ఫార్మా కంపెనీ జైడస్‌ క్యాడిలా కోరింది. ఈ మేరకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసింది. తేలికపాటి లక్షణాలున్న కేసుల్లో కాక్‌టెయిల్‌ ప్రధాన చికిత్సల్లో ఒకటిగా మారుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు ఈ మందునే హర్యానా గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రి వైద్యులు ఉపయోగించి ఒక వృద్ధుడికి చికిత్స చేసినట్టు ప్రకటించారు. దీంతో మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేసిన ఏకైక భారతీయ సంస్థగా జైడస్ నిలిచింది.


Next Story