తప్పుడు రివ్యూ కారణంగా మూతపడిన రెస్టారెంట్..!
Youtuber sparks dispute a false review leads to restaurant shut down. రివ్యూ ల ఫై ఆధారపడి వస్తువులు కొంటూ ఉంటాం కానీ తప్పుడు రివ్యూ కారణంగా మూతపడిన రెస్టారెంట్.
By తోట వంశీ కుమార్ Published on 16 Jan 2021 2:45 PM GMTమనం ఆన్‌లైన్ ద్వారా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలని భావించినప్పుడు ముందుగా.. ఆ ప్రొడక్ట్ రివ్యూ, రేటింగ్ చూసి.. దానిని కొనాలా? వద్దా? అని ఆలోచిస్తాం. అందువల్ల రివ్యూపై ఆధారపడే బిజినెస్ డెవలప్ ఉంటుంది. ఓ యూట్యూబర్ తన ఛానల్ ద్వారా ఓ రెస్టారెంట్ పై తప్పుడు రివ్యూ ఇచ్చాడు. ఇంకేముంది.. ఆ హోటల్ ఏకంగా మూతపడిపోయింది. ప్రస్తుతం ఆ యూట్యూబర్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దక్షిణ కొరియాకు చెందిన హయన్ ట్రీ యూట్యూబ్‌లో ఫుడ్ బ్లాగ్ నడుపుతున్నాడు. దీని కోసం అతను వివిధ రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ భోజనాల పై వీడియోలు తీసి తన చానల్ ద్వారా పోస్ట్ చేస్తుంటాడు. ఇతని యూట్యూబ్ ఛానల్ కూడా దాదాపు ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో భాగంగానే హయన్.. డయగు అనే ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఫుడ్ ఆర్డర్ రాగానే తన ప్లేటులో వడ్డించిన ఆహారపదార్థాలలో అన్నం మెతుకులు కనిపించాయి. దీంతో ఇతర కస్టమర్లు తినగా మిగిలిన ఆహార పదార్థాలను ఇతరులకు వడ్డిస్తున్నారని భావించిన హాయన్ రెస్టారెంట్ యజమానులు కస్టమర్లని ఈ విధంగా మోసం చేస్తున్నారంటూ వీడియోని తీసి యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేస్తూ ఆ హోటల్ పై తప్పుడు రివ్యూ ఇచ్చాడు.
అతని ఛానల్ ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియో అతికొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ విధంగా కస్టమర్లను మోసం చేస్తున్నారని రెస్టారెంట్ యజమాని పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ వీడియో చివరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారుల కంట పడడంతో వెంటనే రెస్టారెంట్ పై దాడి చేసి రెస్టారెంట్ ను సీజ్ చేశారు. తమ హోటల్ లో అన్ని నాణ్యమైన ఆహార పదార్థాలను వడ్డీస్తున్నామని యాజమాన్యం చెప్పినా.. అధికారులు వినలేదు.
అయితే ఈ సంఘటన గతంలో జరిగినప్పటికీ, తాజాగా హయాన్ ట్రీ మళ్లీ ఆ రెస్టారెంట్ ను సందర్శించడంతో అసలు విషయం బయటపడింది. ఇంతకు ముందు తన ఆహారపదార్థాలలో మెతుకులు తన ప్లేటులో నీవే అని తెలియగానే హయాన్ ట్రీ ఎంతో తప్పు చేశానని భావించి తన తప్పుకు పశ్చాత్తాపంతో హోటల్ యాజమాన్యానికి క్షమాపణ తెలియజేశాడు. అంతేకాకుండా తను పెట్టిన వీడియోలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చానని తాజాగా మరో వీడియో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హయాన్ ట్రీ వైరల్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇతనిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఓ రెస్టారెంట్ మూతపడింది అంటూ ఎంతోమంది తమదైన శైలిలో స్పందించి వేల సంఖ్యలో సబ్‌స్రైబర్స్ ఆ చానల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేశారు.