డ్రాగ్-రేసింగ్ వీడియోలతో పాపులర్ అయిన 25 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని నాసావు ఎక్స్‌ప్రెస్‌వేలో బుధవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో అతడు మరణించారు. ఆన్‌లైన్‌లో 1Stockf30 అని పాపులర్ అయిన ఆండ్రీ బీడిల్ 2023 BMW ను డ్రైవ్ చేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయాడు. అతడు అధిక వేగంతో నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని న్యూయార్క్ పోలీసులు ధృవీకరించారు.
అతని వాహనం ఒక మెటల్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పీపుల్ మ్యాగజైన్‌కి తెలిపారు. బీడిల్‌ను జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్‌కు తరలించగా అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 59,500 మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 250,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మిస్టర్ బీడిల్, స్ట్రీట్ రేసింగ్‌పై కంటెంట్‌ను తరచుగా పంచుకునేవాడు.