China: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్.. ముచ్చటగా 3వసారి ఎన్నిక
ఎన్‌పిసి శుక్రవారం నాటి సమావేశంలో చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ చరిత్రాత్మకంగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
By అంజి Published on 10 March 2023 10:54 AM ISTచైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్.. ముచ్చటగా 3వసారి ఎన్నిక
14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పిసి) శుక్రవారం నాటి సమావేశంలో చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ చరిత్రాత్మకంగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతను సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్‌గా కూడా ఎన్నికైనట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. దీంతో ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టనున్న షీ జిన్‌పింగ్.. సరికొత్త చరిత్ర సృష్టించారు. జిన్‌పింగ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. దీంతో చైనా దేశానికి ఆయన జీవితకాల అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గం సుగమమైంది. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో దాదాపు 3,000 మంది సభ్యులు (NPC) జిన్‌పింగ్ అధ్యక్షుడిగా ఉండటానికి ఇతర అభ్యర్థి లేని ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఓటు వేశారు.
ఎన్నికల తరువాత 69 ఏళ్ల జిన్‌పింగ్ కూడా రాజ్యాంగానికి విధేయతతో బహిరంగ ప్రతిజ్ఞ చేశారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడైన హన్ ఝెంగ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నకున్నారు. గత అక్టోబరులో జరిగిన ప్రధాన పార్టీ కాంగ్రెస్‌లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా చారిత్రాత్మకంగా మూడవసారి ఎన్నికైనందున, మావో జెడాంగ్ తర్వాత చైనా యొక్క అత్యంత శక్తివంతమైన పాలకుడిగా తన స్థానాన్ని ఖరారు చేసుకున్నందున శుక్రవారం జరిగిన ఓటు చాలా ఉత్సవంగా జరిగింది. ప్రతి ఐదేళ్లకోసారి దేశ నాయకత్వంలో మార్పులు జరుగుతాయి. అయితే ఇవి సాధారణంగా పార్టీ కాంగ్రెస్‌లో ప్రకటించిన పునర్వ్యవస్థీకరణకు దగ్గరగా ప్రతిబింబిస్తాయి.
2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్ ఫస్ట్‌టైమ్ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఈ పదవీలో కొనసాగుతున్నారు. దీంతో చైనా కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ తర్వాత.. ఆ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా పేరుతెచ్చుకున్నారు. 2018లో జిన్‌పింగ్ ప్రభుత్వం రాజ్యాంగంలో కీలక సవరణలు చేస్తూ.. రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశ అధ్యక్షుడికి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్ ముచ్చటగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.