సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ట్విట్టర్ అలియాస్ ఎక్స్ ను చాలా మంది ఫ్రీగా ఉపయోగిస్తూ ఉన్నారు. కొందరు వెరిఫికేషన్ కోసం డబ్బులు కడుతూ ఉన్నారనుకోండి. అయితే త్వరలో కొత్త వినియోగదారుల నుండి కూడా డబ్బు వసూలు చేయడం ప్రారంభించనుంది. ట్విట్టర్ లో చేరిన కొత్త వినియోగదారులు ట్వీట్‌లను లైక్ చేయడానికి, పోస్ట్ చేయడానికి, ప్రత్యుత్తరం ఇవ్వడానికి, బుక్‌మార్క్ చేయడానికి కూడా డబ్బులు చెల్లించాలి. కొత్త వినియోగదారులు నామమాత్రపు వార్షిక ఛార్జీని చెల్లించాలని ట్విట్టర్ కోరుతోంది. ఈ ఛార్జీలు అతంతం మాత్రమే ఉంటాయని ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్ తెలిపారు. ఈ విధానం ఇప్పటికే న్యూజిల్యాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో అమలులో ఉంది. ఫేక్ అకౌంట్లను నియంత్రించడం, స్పామ్ కట్టడి చేయడం, యూజర్ల ఎక్స్‌పీరియన్స్ ను మెరుగుపరచడం కోసం ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్ తెలిపారు.
న్యూజిలాండ్ కరెన్సీ ప్రకారం ఛార్జీలు కేవలం $1.75 మాత్రమే. ఈ సేవను ఉపయోగించడానికి చెల్లించే ఈ నియమం ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో మాత్రమే అమలులో ఉంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో స్పామ్, బోట్ ఖాతాల గురించి ఎప్పటికప్పుడు ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందుకే ఎన్నో మార్పులను ఇప్పటికే తీసుకుని వచ్చిన మస్క్.. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఛార్జ్ చేయడానికి సిద్ధమయ్యారు.