ప్ర‌పంచంలోనే అతి పురాత‌న బీర్ ఫ్యాక్టరీ బయటపడింది.. ఎక్క‌డంటే..

World's Oldest Brewery. ప్ర‌పంచంలోనే అత్యంత పురాతన బీర్‌ ఫ్యాక్టరీ బయటపడింది. పురావస్తు శాఖకు చెందిన ప్రదేశంలో ఇది బ‌య‌ట‌‌ప‌డింది.

By Medi Samrat  Published on  14 Feb 2021 12:41 PM GMT
Worlds Oldest Brewery

ప్ర‌పంచంలోనే త్యంత పురాతన బీర్‌ ఫ్యాక్టరీ బయటపడింది. ఈజిప్టు దేశంలోని పురావస్తు శాఖకు చెందిన ప్రదేశంలో ఇది బ‌య‌ట‌‌ప‌డింది. ఈజిప్టు-అమెరికా దేశాల‌ పురావస్తు శాఖల‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ ఫ్యాక్టరీ వెలుగుచూసింది. తాజాగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు.

ఈజిప్టు రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలోగ‌ల‌ ఎబిడాస్ ప‌ట్ట‌ణంలో దీన్ని క‌నుగొన్నారు. నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఇది నిక్షే‌పిత‌మైవుంది. ఈ బీర్‌ ఫ్యాక్టరీ నర్మర్‌ చక్రవర్తి కాలానికి చెందినదిగా పరిశోధ‌కులు గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్‌లున్న‌ట్లు.. ఒక్కో యూనిట్‌ ఇరవై మీటర్లు పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉన్న‌ట్లు క‌నుగొన్నారు.

ఒక్కో యూనిట్‌లో దాదాపు 40 కుండలు రెండు వరుసలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండలలో బీర్‌ తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను వేసి మరిగించేవార‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. పురాత‌న కాలంలో ఈజిప్టులో రాజ కార్యక్రమాల కోసం బీరును ఉపయోగించేవార‌ని చ‌రిత్ర‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ది. అయితే, ఈ బీరు ఫ్యాక్టరీని 1900ల‌లో మొట్టమొదటిసారిగా క‌నుగొన్నా.. ఫ్యాక్టరీ క‌చ్చితంగా ఎక్కడుందో వారు గుర్తించ‌లేక‌పోయారు.




Next Story