యుద్ధం వద్దంటూ.. ర‌ష్యా టీవీ షోలో ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించిన.. మహిళా ఎడిట‌ర్‌ అరెస్ట్‌

Woman runs onto live Russian TV news set with ‘they are lying to you’ sign. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా టీవీ ఛానెల్‌కు చెందిన ఓ మహిళా ఎడిటర్‌.. లైవ్‌లో తన

By అంజి  Published on  15 March 2022 5:19 AM GMT
యుద్ధం వద్దంటూ.. ర‌ష్యా టీవీ షోలో ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించిన.. మహిళా ఎడిట‌ర్‌ అరెస్ట్‌

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా టీవీ ఛానెల్‌కు చెందిన ఓ మహిళా ఎడిటర్‌.. లైవ్‌లో తన నిరసన గళాన్ని వినిపించారు. సోమవారం సాయంత్రం రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని ఛానల్ 1లో వార్తల బులిటెన్‌ ప్రత్యక్ష ప్రసార జరుగుతున్న సమయంలో, యుద్ధ వ్యతిరేక ప్లకార్డు పట్టుకున్న ఒక మహిళా ఎడిటర్‌ సెట్‌పైకి పరిగెత్తి న్యూస్‌ ప్రెజెంటర్ వెనుక నిలబడింది. "యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. ప్రచారాన్ని నమ్మవద్దు. ఇక్కడ మీకు అబద్ధాలు చెబుతున్నారు" అని బోర్డు రాసి ఉన్న ప్లకార్డును మహిళా ఎడిటర్‌ పట్టుకుంది. ఇదంతా లైవ్‌లో టెలిక్యాస్ట్‌ అయ్యింది. ఆ తర్వాత నిరసన తెలిపిన మెరీనా ఓవ్స్యానికోవా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నట్లు సమాచారం. ఆమె ఛానల్ 1లో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

అంతకుముందు.. ఆమె తన వీడియోను రికార్డ్ చేసింది. అందులో ఆమె రష్యన్ దండయాత్రను 'నేరం'గా పేర్కొంది. "క్రెమ్లిన్ ప్రచారం" కోసం పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పింది. "నేను టెలివిజన్ స్క్రీన్ నుండి అబద్ధాలు చెప్పడానికి అనుమతించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. రష్యన్లను జాంబీలుగా మార్చడానికి నేను అనుమతించినందుకు సిగ్గుపడుతున్నాను" అని ఆమె చెప్పింది. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని రష్యా ప్రజలను ఆమె కోరారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి.. మెరీనా ఓవ్స్యానికోవా యొక్క ఫేస్‌బుక్ పేజీ ఆమె నిరసన చర్యకు ధన్యవాదాలు తెలిపే వ్యాఖ్యలతో నిండిపోయింది అని బీబీసీ తెలిపింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వీడియో సందేశంలో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. "సత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నించడం ఆపని రష్యన్‌లకు, వ్యక్తిగతంగా ఛానల్ వన్ స్టూడియోలో యుద్ధానికి వ్యతిరేకంగా పోస్టర్‌తో ప్రవేశించిన మహిళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని" అని అతను చెప్పాడు.


Next Story