ఆమె చీర కడితే కన్నీళ్లు ఆగ‌వంటున్న నెటిజన్లు!

Will Kamala Harris wear saree for Inauguration Day. కమలా హారిస్..‌ ప్రస్తుతం ఈ పేరు అందరినోట వినబడుతుంది. ఎందుకంటే ఆసియా ఖండానికి చెందిన ఓ నల్లజాతి మహిళ.

By Medi Samrat  Published on  20 Jan 2021 3:42 AM GMT
Kamala Harris

కమలా హారిస్..‌ ప్రస్తుతం ఈ పేరు అందరినోట వినబడుతుంది. ఎందుకంటే ఆసియా ఖండానికి చెందిన ఓ నల్లజాతి మహిళ తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంగతి మనకు తెలిసిందే. అయితే మరో 24 గంటల్లో ఈ భారత సంతతి మహిళ అగ్రరాజ్యం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో ఈమె గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

మరో 24 గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమల హరీస్ గురించి సోషల్ మీడియాలో ఒక డిబేట్ నడుస్తుందనే చెప్పవచ్చు. ప్రమాణ స్వీకార మహోత్సవం నికి కమల హరీస్ ఎలాంటి దుస్తులు ధరిస్తారు అనే విషయం పై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.2019 లో కమలా హారిస్‌ వన్ ఏపీఐఏ నెవాడా అనే ఆసియా అమెరికన్ గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేక్షకురాలు ''ఒకవేళ మీరు గనక అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ప్రమాణ స్వీకారం నాడు భారత సంప్రదాయాలను గౌరవించే దుస్తులను ధరిస్తారా.. అని ప్రశ్నించగా అందుకు కమలా హారిస్‌ ముందు గెలవనివ్వండి అంటూ సమాధానం చెప్పారు..

Advertisement

ఆరోజు అన్న మాట ఈరోజు నిజం అవడంతో ఈమె ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎలాంటి దుస్తులు ధరిస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈమె భారతీయ సాంప్రదాయ ప్రకారం చీర ధరిస్తారా? లేక షూట్ వేసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం గురించి కొందరు భారతీయ సంప్రదాయం ప్రకారం చీర ధరిస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ బిభుమోహపాత్ర ''మీకు డ్రెస్‌ డిజైన్‌ చేసే అవకాశం లభిస్తే.. గౌరవంగా భావిస్తాను'' అనగా మరొక నెటిజన్ "మిమ్మల్ని చీరలో చూస్తే నా కంటిలో నుంచి వచ్చే ఆనందభాష్పాలు ఎవరూ ఆపలేరని" తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Next Story
Share it