షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టనున్న‌ది ఆయ‌నే..!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.

By Medi Samrat  Published on  5 Aug 2024 6:22 PM IST
షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టనున్న‌ది ఆయ‌నే..!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. నిర‌స‌న‌ల‌లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టారనే వార్తల నేప‌థ్యంలో.. ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తన ప్రసంగంలో దేశం యొక్క అన్ని బాధ్యతలను నేను తీసుకుంటున్నాను. అరాచకాలకు, హింసకు దూరంగా ఉండండి. త్వరలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. దయచేసి మద్దతు ఇవ్వండని కోరారు.

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ఆర్మీ పాలన విధించినట్లయితే.. ఆర్మీ చీఫ్ ఆధీనంలో పాల‌న ఉంటుంది. ప్రస్తుతం కర్ ఉజ్ జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు.

లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఇటీవలే పదోన్నతి పొంది ఆర్మీ జనరల్‌గా నియమితులయ్యారు. 58 ఏళ్ల లెఫ్టినెంట్ జనరల్ వకార్.. జూన్ 11, 2024న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఎంపికయ్యారు. జూన్ 23, 2024న మూడేళ్ల కాలానికి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.

1966లో ఢాకాలో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్.. 1997 నుండి 2000 వరకూ బాంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ముహమ్మద్ ముస్తాఫిజుర్ రెహమాన్ కుమార్తె సరహ్నాజ్ కమలిక జమాన్‌ను వివాహం చేసుకున్నారు.

బంజమాన్ బంగ్లాదేశ్ నేషనల్ యూనివర్శిటీ నుండి మాస్టర్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ డిగ్రీని, లండన్లోని కింగ్స్ కాలేజ్ నుండి డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.

ఆర్మీ చీఫ్ కావడానికి ముందు.. ఆయ‌న ఆరు నెలల కంటే కొంచెం ఎక్కువ జనరల్ స్టాఫ్ చీఫ్‌గా పనిచేశాడు. సైనిక కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆయ‌న‌ ముఖ్యమైన పాత్ర పోషించాడు.

జమాన్ మూడున్నర దశాబ్దాల కెరీర్‌లో మాజీ ప్రధాని హసీనాతో కూడా కలిసి పనిచేశారు. అయితే ఈ నెలలో మరోసారి దేశంలో నిరసనల కారణంగా.. జమాన్ బాధ్యతలు స్వీకరించాడు. ప్రజల జీవితాలను, ప్రభుత్వ ఆస్తులను రక్షించే బాధ్యతను తీసుకున్నారు.

Next Story