వాట్సప్ వద్దు అంటున్న అపర కుబేరుడు.. కారణం ఏంటంటే?
WhatsApp is forcing users to share personal data with Facebook. వాట్సప్ వద్దు అంటున్న అపర కుబేరుడు..
By Medi Samrat Published on 9 Jan 2021 6:00 PM IST
ఈ సిగ్నల్ యాప్ కూడా వాట్స్అప్ తరహాలోనే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రొటోకాల్‌తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్, ప్రైవసీ రీసెర్చర్స్, విద్యావేత్తలు, జర్నలిస్టులు వినియోగిస్తున్నారు.ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారి సంఖ్య పెరగడంతో కొంతమందికి యూజర్స్ కి వెరిఫికేషన్ కోడ్ రావడం లేదు. ఈ సమస్యపై సిగ్నల్స్ స్పందిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది.
వాట్సప్ వద్దు సిగ్నల్స్ ముద్దు అని తెలియజేయడానికి ముందు మస్క్ ఫేస్ బుక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా క్యాపిటల్ భవనంపై డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడానికి గల కారణం కూడా ఫేస్ బుక్ అని అతను తెలియజేశాడు. అంతేకాకుండా డొమినో ఎఫెక్ట్ పేరుతో ఆయన పరోక్షంగా ఫేస్బుక్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.